కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే? 

ఆల్కహాల్‌ తీసుకోవడం వల్ల కాలేయం దెబ్బతింటుంది. కాబట్టి.. వీలైనంత వరకు మద్యపానానికి దూరంగా ఉండటం మంచిది.

Image:Eenadu 

 తాజా పండ్లు, కూరగాయలను సమపాళ్లలో తీసుకోవాలి. పీచు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను మెనూలో చేర్చుకోవాలి.

Image:Eenadu

 అధికంగా పిండిపదార్థాలు ఉండే డొనట్స్‌, వైట్‌బ్రెడ్ వంటి వాటిని తగ్గించుకోవాలి.

Image:Eenadu

తక్కువ మోతాదులో మాంసాహారం, తక్కువ కొవ్వు ఉన్న పాలు, పాల ఉత్పత్తులు తీసుకోవడం మంచిది.

Image:Eenadu

సరైన ఆహారపు అలవాట్లతోపాటు రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఎత్తుకు తగిన బరువు ఉండేలా చూసుకోవాలి. ఫలితంగా ఫ్యాటీ లివర్‌ సమస్య నుంచి తప్పించుకోవచ్చు. Image:Eenadu

పలు అనారోగ్యాలకు ఉపయోగించే మందులకు సంబంధించి జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇవి కాలేయం పనితీరుని దెబ్బతీసే అవకాశముంది. కాబట్టి వైద్యుల సూచనలు లేకుండా ఎలాంటి మందులను ఉపయోగించొద్దు. Image:Eenadu

వాల్‌నట్స్‌, అవకాడో తినడం వల్ల కాలేయం పనితీరు చురుగ్గా ఉంటుంది.

Image:Eenadu

రసాయనాలతో పండించిన ఆహార పదార్థాలు తీసుకోకపోవటమే మంచిది. దీని వల్ల లివర్‌కు ముప్పు కలుగుతుంది. సేంద్రీయ పద్దతుల్లో పండించిన ఆహారాన్ని తీసుకునేందుకు మొగ్గుచూపాలి.

Image:Eenadu

అతిగా ఆలోచించకండి..

పెసరపప్పు గురించి ఇవి తెలుసా?

టైప్‌- 2 మధుమేహానికి చెక్‌ పెడదాం!

Eenadu.net Home