మానసికంగా దృఢంగా ఉండాలంటే..
ప్రకృతి.. మానసిక ఆందోళనలను తగ్గిస్తుంది. ఒంటరితనాన్ని దూరం చేస్తుంది. తరచూ ఉద్యానవనాలకు వెళ్లి ప్రకృతిని ఆస్వాదించడం అలవాటు చేసుకోవాలి.
Image: RKC
భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవాలి. కొన్ని ఆలోచనలు మిమ్మల్ని బాధల్లోకి నెట్టొచ్చు. మరికొన్ని కోపాన్ని తెప్పించొచ్చు. అలాంటి భావోద్వేగాలను నియంత్రించుకోగలిగితే మానసికంగా దృఢంగా ఉండగలరు.
Image: RKC
ఎదుటివాళ్లకు తోచిన సహాయం చేయడం.. ప్రేమగా మాట్లాడటం.. చిన్నారులతో ఆడుకోవడం వంటివి కూడా మానసిక ఆరోగ్యం మెరుగవ్వడానికి దోహదపడతాయి.
Image: RKC
బాధలో ఉన్నప్పుడు మీ ఫీలింగ్స్‌ను మీతో నమ్మకంగా ఉండే సన్నిహితులు, స్నేహితులతో పంచుకోండి. భారం తగ్గి మానసికంగా కుదుటపడతారు.
Image: RKC
ఆర్థిక సమస్యలు కూడా మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అయితే, చక్కటి ఆర్థిక ప్రణాళికతో రుణాలు చెల్లిస్తూ, పొదుపు చేస్తూ ఉంటే ఆర్థిక సమస్యలు తొందరగానే తొలగిపోతాయి.
Image: RKC
తగినంత నిద్ర లేకపోతే మనిషి మానసిక స్థితిలో తేడా వస్తుంది. ఏ పనిపై ఏకాగ్రత నిలవదు. తొందరగా నీరసించిపోతారు. నిద్రలేమి అలాగే కొనసాగితే ప్రాణాలకే ముప్పు. అందుకే రోజూ కనీసం 6 - 8 గంటలు నిద్రించాలి.
Image: RKC
శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే మానసికంగానూ ఆరోగ్యంగా ఉండగలం. కాబట్టి.. ప్రతి రోజు వ్యాయామం చేయాలి. లేదా ఓ క్రీడను హాబీగా మార్చుకోండి.
Image: RKC
అవి కుదరకపోతే ఇంట్లోనే డ్యాన్స్ చేయొచ్చు. తోటపని, ఇల్లు శుభ్రం చేయడం వంటి పనులూ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
Image: RKC
ధ్యానం చేయడం వల్ల మానసిక ఆందోళనలు తొలగిపోయి ప్రశాంతత లభిస్తుంది. భావోద్వేగాలు నియంత్రణలో ఉంటాయి. ఉదయాన్నే కొంత సమయం ధ్యానం చేస్తే రోజంతా హుషారుగా ఉండటమే కాదు.. కొత్త ఆలోచనలు చేయగలుగుతారు.
Image: RKC
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. సమయానికి భోజనం చేయాలి. వీలైనంత ఎక్కువగా నీరు తాగాలి. ఉదయం వేళలో కాఫీ/టీ తాగితే ఫర్వాలేదు కానీ, పడుకునే ముందు తాగకూడదు.
Image: RKC
గతం గురించి ఆలోచించకుండా.. కొత్త అనుభూతుల్ని ఆస్వాదించేందుకు సిద్ధంగా ఉండాలి. భవిష్యత్తుపై సానుకూల దృక్పథాన్ని ఏర్పరుచుకోవాలి. అప్పుడే మానసికంగా ధృడంగా ఉండగలుగుతారు.
Image: RKC