ఫోన్‌ పోయిందా? డిజిటల్ యాప్స్‌ను బ్లాక్‌ చేశారా?

సాంకేతిక యుగంలో నగదు లావాదేవీలు కూడా స్మార్ట్‌గా మారిపోయాయి. బ్యాంక్‌ ఖాతాతో అనుసంధానమై నడిచే డిజిటల్ పేమెంట్‌ యాప్స్‌తో అన్ని రకాల చెల్లింపులు జరుగుతున్నాయి.

Image: RKC

ఈ క్రమంలోనే చెల్లింపుల కోసం మొబైల్‌లో గూగుల్‌ పే, పేటీఎం, ఫోన్‌పే యాప్స్‌ వంటి ఉపయోగిస్తున్నారు. మరి ఆ మొబైల్‌ పోతే? ఎవరైనా ఆ మొబైల్‌ ఉపయోగించి డిజిటల్‌ పేమెంట్స్‌ చేసి నగదు కొట్టేస్తే?

Image: RKC

అలా జరగకుండా ఉండాలంటే ఫోన్‌ పోయిన వెంటనే ఆయా యాప్స్‌లో మీ అకౌంట్‌ను బ్లాక్‌ చేయాలి. ఏయే యాప్‌లో ఎలా బ్లాక్‌ చేయాలో తెలుసుకుందామా?

Image: RKC

గూగుల్‌ పే

పోగొట్టుకున్న ఫోన్‌లోని గూగుల్‌ పే అకౌంట్‌ బ్లాక్ చేయాలంటే.. మరో ఫోన్‌ నుంచి 1800-419-0157 నంబర్‌కు కాల్‌ చేయాలి.

Image: Facebook

అనంతరం సంస్థ ప్రతినిధితో మాట్లాడే ఆప్షన్‌ ఎంచుకొని వారు అడిగిన వివరాలు తెలియజేస్తే.. అకౌంట్‌ బ్లాక్‌ చేస్తారు. దీంతో లావాదేవీలు నిలిచిపోతాయి. 

Image: Facebook

పేటీఎం

పేటీఎం అకౌంట్‌ బ్లాక్‌ చేయాలంటే.. 01204456456 నంబర్‌కి కాల్‌ చేయాలి. ‘రిపోర్ట్‌ లాస్ట్‌ ఆర్‌ అన్‌ఆథరైజ్డ్‌ యూసేజ్‌.. ’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

Image: Facebook 

ఆ తర్వాత ‘లాస్ట్‌ ఫోన్‌’ ఆప్షన్‌ను ఎంచుకొని మీ రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌ను ఎంటర్‌ చేయాలి. దీంతో మీ పేటీఎం అకౌంట్‌ బ్లాక్‌ అవుతుంది. పేటీఎం వెబ్‌సైట్‌లోనూ వివరాలు నమోదు చేసి బ్లాక్‌ చేయొచ్చు.

Image: Facebook

ఫోన్‌పే

మొబైల్‌లోని ఫోన్‌పే అకౌంట్‌ బ్లాక్‌ చేయాలనుకుంటే.. 08068727374 / 02268727374 నంబర్‌కు కాల్‌ చేయాలి.

Image: Facebook

ఫోన్‌పేతో రిజిస్టర్‌ అయిన మీ మొబైల్‌ నంబర్‌, మెయిల్‌ ఐడీ, బ్యాంక్‌ వివరాలు వెల్లడిస్తే.. అకౌంట్‌ను బ్లాక్‌ చేస్తారు. 

Image: Facebook

వీటికన్నా ముందు.. మీ మొబైల్‌ సిమ్‌ను నెట్‌వర్క్‌ ప్రొవైడర్‌తో మాట్లాడి బ్లాక్‌ చేయించాలి. దీని ద్వారా లావాదేవీల్లో కీలకమైన ఓటీపీలు నిలిచిపోతాయి.

Image: Facebook

₹15 వేల్లోపు స్మార్ట్‌ఫోన్లు ఇవే..

వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఏఐ!

ఫేక్‌ కాల్స్‌కు ‘చక్షు’తో చెక్‌

Eenadu.net Home