చలికాలంలో మధుమేహులు జాగ్రత్త సుమా..!
మధుమేహులకు చక్కెర నియంత్రణ కాలాలకు అనుగుణంగా మారిపోతుంది. ఈ చలికాలంలో మరీ జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిని పరిశీలించండి...!
Image:EENADU
చలిగాలితో చక్కెరస్థాయిలు మార్పులకు లోనవుతాయి. శారీరక శ్రమ లేకపోవడంతో గ్లూకోజ్ స్థాయి అదుపులో ఉండదు. మందులు వాడుతున్నా ఇబ్బందులు ఎదురవుతాయి.
Image:EENADU
మధుమేహం నియంత్రణలో లేకపోవడంతో కిడ్నీ, గుండె, నరాలు, కళ్లకు నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. ఆహారం కూడా ఆచితూచి తీసుకోవాలి.
Image:RKC
ఆహారం ఎప్పుడూ తీసుకునేలా కాకుండా కాస్తంత తగ్గించి తీసుకోవాలి. అన్నం తక్కువగా తీసుకోవడంతో మధుమేహాన్ని అదుపులోకి తీసుకొని రావొచ్చు.
Image:RKC
ఈ చలికాలంలో ఎక్కువగా కూరగాయలను తీసుకోవాలి. వాటిలో ఫైబర్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇవి చక్కెరనే కాదు శరీర బరువును అదుపులోకి తీసుకొస్తాయి.
Image:RKC
ఎక్కువగా బ్రకోలీ, బీట్‌రూట్, ముల్లంగి, బచ్చలికూర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, గ్రీన్‌బీన్స్, బఠానీలను ఆహారంలో భాగం చేసుకుంటే మంచిది. ముల్లంగిలో ఫైబర్‌తో పాటు ఎ,బి6,సి,ఇ, కె విటమిన్లు అధికంగా లభిస్తాయి.
Image:RKC
నిమ్మజాతికి చెందిన పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. వీటిల్లో ఫైబర్, విటమిన్ సి పుష్కలంగా ఉండటంతో పోషకాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు కణజాల క్షీణతను నివారిస్తాయి. బెర్రీ పండ్లు ఎంతో మేలు చేస్తాయి.
Image:RKC
మధుమేహంతో ఇబ్బంది పడుతున్నప్పుడు ప్రోటీన్ ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. మాంసం, చేపలతో పాటు ఒమేగా కొవ్వు ఉండే గుడ్లను బాగా తీసుకుంటే బాగుంటుంది.
Image:RKC
బియ్యం, బంగాళాదుంపలను కాస్త తగ్గించి తీసుకోవాలి. వీటితో తొందరగా చక్కెర స్థాయి పెరుగుతుంది. వీలయితే బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు. దీంతో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.
Image:RKC
బెల్లం, తేనె, చక్కెరలను సాధ్యమయినంత తక్కువగా తీసుకోవాలి. చలి ఎక్కువగా ఉందని కాఫీ, టీలు తాగాలనుకుంటే మంచిది కాదు..వాటికి చాలా వరకు దూరంగా ఉండాల్సిందే.
Image:RKC
గొంతునొప్పి, దగ్గు, జలుబు ఉందని చప్పరించే మందులు, సిరప్‌లు, తేనె ఉపయోగించే పదార్థాలను తినడం ఆరోగ్యదాయకం కాదు. వీటితోనూ ముప్పు రావొచ్చు. అన్ని రకాల జాగ్రత్తలను ఈ సీజన్‌లో వైద్యులను అడిగి తెలుసుకోవాలని మరచిపోవద్దు.
Image:RKC