గుండెపోటు వస్తే సీపీఆర్‌ ఎలా చేయాలంటే...!

తీవ్ర గుండెపోటు వచ్చినపుడు వెంటనే స్పృహ కోల్పోతారు. ఏ మాత్రం ఆలస్యం చేసినా బతకడం కష్టం. ఇలాంటి సమయంలో సమీపంలో ఉన్నవారు సీపీఆర్‌(కార్డియో పల్మరీ రిససిటేషన్‌) చేస్తే బతికే అవకాశం ఉంటుంది.

image:rkc

గుండెపోటుకు గురైన వ్యక్తి పడిపోగానే ముందుగా.. సీపీఆర్‌ చేస్తూనే అంబులెన్స్‌కు సమాచారం అందించాలి.

image:rkc

ఆ వ్యక్తిని గాలి, వెలుతురు ఉన్న చోట, చదునుగా ఉన్న నేలపై పడుకోబెట్టాలి. గుండె కొట్టుకుంటుందో లేదో పరిశీలించాలి.

image:rkc

గుండె ఆగిపోయినట్లయితే ఎడమ చేతివేళ్లలోకి.. కుడి చేతివేళ్లు పెట్టి ఛాతీ మధ్యభాగంలో నొక్కాలి. 

image:rkc

ఇలా ఛాతీపై నొక్కే సమయంలో సీపీఆర్‌ చేసే వ్యక్తి మోచేయిని వంచకూడదు. చేతులతో నొక్కే సమయంలో ఛాతీ కనీసం 5 సెం.మీ లోపలికి వెళ్లాలి.

image:rkc

 సీపీఆర్‌లో భాగంగా నిమిషానికి కనీసం వందసార్లు గట్టిగా అదమాలి. ఛాతీ ఎముకలు విరిగిపోతాయని భయపడొద్దు. 

image:rkc

 ఒక నిమిషం తర్వాత నాడీ కొట్టుకుంటుందో.. లేదో గమనించాలి. పల్స్‌ లేకపోతే మళ్లీ సీపీఆర్‌ చేయాలి. ఇలా కనీసం 15-25 నిమిషాలు చేస్తే ప్రయోజనం ఉండొచ్చు.

image:rkc

కొద్దిసేపు చేసి వదిలేస్తే లాభం ఉండదు. అంబులెన్స్‌ వచ్చే దాకా ప్రయత్నించాలి. ఈ క్రమంలో తిరిగి గుండె పని చేసే అవకాశముంది.

image:rkc

కొంతమంది నోటిలో నోరు పెట్టి గాలి ఊదుతారు. దీని కంటే సీపీఆర్‌ పద్ధతే మేలు చేస్తుంది. 

image:rkc

స్పృహ తప్పి పడిపోగానే కొంతమంది నోట్లో, ముఖంపై నీళ్లు పోస్తారు. పల్స్‌ ఉంటే ఇబ్బంది లేదు.. కానీ పల్స్‌ లేనప్పుడు ఇలా చేస్తే ఊపిరితిత్తుల్లోకి నీరు వెళ్లే ప్రమాదముంది.

image:rkc 

రక్తహీనతకు అనేక కారణాలు అంటున్నారు వైద్యులు..

ఆరోగ్యాన్ని, ఆయుష్షును అందించే ఆహారం!

లివర్‌ కొవ్వుకి ఈ ఆహరపదార్థాలే కారణం!

Eenadu.net Home