వాట్సాప్ ద్వారా క్రెడిట్‌ స్కోర్‌.. తెలుసుకోండిలా!

క్రెడిట్‌ బ్యూరో సంస్థ ఎక్స్‌పీరియన్‌.. తాజాగా వాట్సాప్‌ ద్వారా క్రెడిట్‌ స్కోర్‌ తెలుసుకునే సదుపాయాన్ని ప్రారంభించింది. మీరూ క్రెడిట్‌ స్కోర్‌ తెలుసుకోవాలంటే.. ఈ విధానాన్ని ఫాలో అవ్వండి..

Image: Eenadu

మొదట మీ మొబైల్‌ నుంచి 9920035444 నంబర్‌కు ‘Hey’ అని వాట్సాప్‌ చేయాలి. వచ్చే రిప్లైలో ‘వ్యూ క్రెడిట్‌ స్కోర్‌’పై క్లిక్‌ చేయాలి.

Image: Eenadu

ఆ తర్వాత మీ పేరు, ఇ-మెయిల్‌ ఐడీ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.

Image: Eenadu

అనంతరం మీ ఫోన్‌ నంబర్‌ను ధ్రువీకరించి.. సెండ్‌ ఓటీపీపై క్లిక్‌ చేయాలి.

Image: Eenadu

మీ నంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్‌ చేయడం ద్వారా వివరాల్ని సంస్థ ధ్రువీకరిస్తుంది.

Image: Eenadu

ఆ వెంటనే మీ క్రెడిట్‌ స్కోర్‌ మీ మొబైల్‌కి సందేశం రూపంలో వస్తుంది. 

Image: Eenadu

క్రెడిట్‌ స్కోరుకు సంబంధించిన పూర్తి నివేదిక మీ ఇ-మెయిల్‌కు వస్తుంది.

Image: Eenadu

నివేదికను చూడాలంటే.. పాస్‌వర్డ్‌ తప్పనిసరి. ఆ పాస్‌వర్డ్‌ వివరాలు మెయిల్‌లోనే ఉంటాయి.

Image: Eenadu

పాస్‌వర్డ్‌తో కూడిన క్రెడిట్‌ స్కోర్‌ నివేదిక కాబట్టి.. దీన్ని ఇతరులు చూడలేరు. 

Image: Eenadu

పన్ను ఆదా హడావుడిలో ఈ తప్పులొద్దు..

ఏ స్కూటర్‌ రేంజ్‌ ఎంత?

టైటన్‌ ఎస్‌బీఐ కార్డ్‌.. ప్రయోజనాలివే..

Eenadu.net Home