ఇంట్లో ఈగల బెడద ఎక్కువైందా.. ఈ చిట్కాలు ట్రై చేయండి!

మన ఇంట్లో ఉండే కర్పూరంతో ఈగలను నివారించవచ్చు. 8-10 కర్పూరం బిళ్లలను పొడి చేసి వాటర్‌ బాటిల్‌ నీటిలో కలపాలి. ఈగలు ఎక్కువగా ఉన్నచోట ఆ నీటిని చల్లాలి.

Source:SocialMedia

ఉప్పునీటిని ఇల్లంతా చల్లి శుభ్రమైన క్లాత్‌తో తుడవాలి.

Source:Pixabay

పావు కప్పు యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌లో 50 చుక్కల యూకలిప్టస్ ఆయిల్‌ని కలపాలి. ఆ మిశ్రమాన్ని ఒక బాటిల్‌లో మిక్స్‌ చేసి ఈగలున్న చోట చల్లాలి.

Source:Pixabay

ఇంటి ఆవరణలో తులసి మొక్కలను పెంచడం ద్వారా ఈగలను నివారించవచ్చు.

Source:Pixabay


వంటకాల్లో సువాసన కోసం వాడే బిర్యానీ ఆకులను కాల్చి ఆ పొగని ఇల్లంతా వ్యాపించేలా చేయాలి.

Source:Pixabay

పుదీనా మొక్కలను ఇంట్లో చిన్న తొట్టిల్లో పెంచడం ద్వారా ఈగలను అరికట్టవచ్చు.

Source:Pixabay


ఇంట్లో లావెండర్‌ బండిల్స్‌ని వేలాడదీయం లేదా లావెండర్‌ నూనెని స్ప్రే చేస్తే ఈగలు రావు.

Source:Pixabay

నాలుగు కప్పుల నీటిలో 2 టేబుల్ స్పూన్‌ల అల్లం పొడి లేదా పేస్ట్‌ని వేసి బాగా మిక్స్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఈగలున్నచోట స్ప్రే చేయాలి.

Source:Pixabay

హోలీ రంగులకు అర్థాలు తెలుసా?

వంట టేస్టీగా వచ్చేందుకు చెఫ్‌లు ఇస్తున్న టిప్స్‌..

నిల్వ పచ్చళ్లను అల్యూమినియం, స్టీలు పాత్రల్లో ఎందుకు పెట్టకూడదు!

Eenadu.net Home