ఏకాగ్రతను ఎలా పెంచుకోవచ్చంటే?
మనం చేసే ఏ పనిలోనైనా ఏకాగ్రత అవసరం. అది లోపిస్తే పనిలో నాణ్యత తగ్గడంతో పాటు విజయం సాధించలేం.
Source:pixabay
అందుకే ఏకాగ్రత పెంచుకోవడం కోసం కొన్ని మార్గాలున్నాయి. అవేంటో తెలుసుకోండి.
Source:pixabay
బ్రెయిన్ ట్రైనింగ్ గేమ్స్(సుడోకు, చదరంగం) వల్ల జ్ఞాపకశక్తితో పాటు ఏకాగ్రత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
Source:pixabay
గంట పాటు వీడియో గేమ్స్ ఆడటం వల్ల కూడా ఏకాగ్రత పెరుగుతుందని ఇటీవల ఓ పరిశోధనలో వెల్లడైంది.
Source:pixabay
వ్యాయామం, శారీరక శ్రమ వల్ల కూడా ఉపయోగం ఉంటుంది.
Source:pixabay
నిద్రలేమి ఏకాగ్రతను దెబ్బతీస్తుంది. అందువల్ల 7- 8 గంటల నిద్ర అవసరం. ధ్యానం కూడా మేలు చేస్తుంది.
Source:pixabay
కాసేపు నడవడం, పార్క్ లేదా మీ గార్డెన్‌లో సమయం గడపడం వల్ల కూడా ఏకాగ్రత పెరుగుతుంది.
Source:pixabay
చేస్తున్న పని నుంచి కాసేపు విరామం తీసుకోవాలి. టీ/ కాఫీ లేదా స్నాక్స్ తినాలి.
Source:pixabay
వంట చేయడం వల్ల కూడా ఏకాగ్రత పెరుగుతుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది.
Source:pixabay