వృత్తిలో మరింత మెరుగవ్వాలంటే..?

మీ కంఫర్ట్‌ జోన్‌ నుంచి బయటకు రావాలి. కెరీర్‌కు ఉపయోగపడే నైపుణ్యాలను సాధించాలి.

Image: Unsplash

ప్రాధాన్యతా క్రమంలో పనులు మొదలుపెట్టాలి. అతి ముఖ్యమైన పనుల్ని ముందుగా పూర్తి చేయాలి. ఆ తర్వాతే మిగతావి.

Image: Unsplash

మల్టీటాస్కింగ్‌ వల్ల ఆయా పనులు నిజానికి నెమ్మదిగా సాగుతాయి. అందుకే, ఒక సమయంలో ఒకే పనిపై దృష్టి సారించండి. తద్వారా ఆ పని తొందరగా పూర్తవుతుంది.

Image: Unsplash

తరచూ మొబైల్‌ చూడటం, మెయిల్స్‌ చెక్‌ చేయడం, సహోద్యోగులతో అనవసరపు ముచ్చట్లు.. ఇలా మీ సమయాన్ని వృథా చేసే పనులను గుర్తించి వాటిని దూరం పెట్టండి.

Image: Unsplash

‘నో’ చెప్పడం కూడా అలవాటు చేసుకోండి. కొన్ని సందర్భాల్లో అది మిమ్మల్ని కాపాడుతుంది.

Image: Unsplash

ఉదయాన్నే మీ రోజువారీ పనులు, లక్ష్యాలను ఒకచోట రాసుకోండి. షెడ్యూల్‌ రూపొందించుకొని నిర్ణీత సమయంలో ఆయా లక్ష్యాలు సాధించేందుకు ప్రయత్నించండి.

Image: Unsplash

గంటల తరబడి ఒకే చోట కూర్చొని పని చేస్తూ ఉంటే శరీరం నీరసించి పోతుంది. మధ్యమధ్యలో లేచి కాసేపు నడవాలి.

Image: Unsplash

రోజూ వ్యాయామం చేయాలి. దీని వల్ల శరీరం ఉల్లాసంగా ఉంటుంది. దీంతో పనుల్ని మీరు మరింత ఉత్సాహంతో చేయగలుగుతారు.

Image: Unsplash

మీరు పనిచేసే చోటు ఆహ్లాదకరంగా, ఒత్తిడిని తగ్గించే విధంగా డిజైన్‌ చేసుకోండి.

Image: Unsplash

మీరు సాధించే ఏ చిన్న విజయాన్నైనా గొప్పగా సెలబ్రేట్‌ చేసుకోండి. అది మిమ్మల్ని పనిలో మరింత ఉత్సాహపరుస్తుంది.

Image: Unsplash

రాష్ట్రానికో ఫేమస్‌ రైస్‌ డిష్‌!

ప్రపంచంలోని టాప్‌-10 ప్రశాంతమైన దేశాలివే!

ప్రపంచంలోనే ఎక్కువ సమయం పట్టే విమాన ప్రయాణాలు

Eenadu.net Home