చిన్న ఇల్లు పెద్దగా కనిపించాలా? ఈ టిప్స్ ట్రై చేయండి!
ఇల్లు చిన్నదైనా.. పెద్దదైనా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడు ఆ ప్రదేశమంతా విశాలంగా కనిపిస్తుంది.
Image: Pixabay
వీలైనంత వరకు ఫర్నీచర్‌ను తగ్గించుకోవాలి. ఇంట్లో వస్తువులు తక్కువగా ఉన్నప్పుడు ఇల్లంతా కాస్త ఖాళీగా పెద్దదిగా కనిపిస్తుంది.
Image: Pixabay
చిన్న ఇంట్లో స్థలాన్ని ఆదా చేయాలంటే మల్టీ యుటిలిటీ ఫర్నీచర్స్ ఉపయోగించవచ్చు. కనీసం రెండు, మూడు రకాలుగా ఉపయోగపడే ఫర్నీచర్స్ మార్కెట్లో లభిస్తున్నాయి.
Image: Pixabay
సోఫా, కుర్చీలను గోడలకు దగ్గరగా పెట్టండి. దీంతో ఇంటి మధ్యలో ఖాళీ స్థలం మిగులుతుంది.
Image: Pixabay
ఇంట్లో గోడలకు వేసిన రంగులకు అనుగుణంగా ఫర్నీచర్‌ని తీసుకుంటే ఇల్లు ఆకర్షణీయంగా ఉండటంతో పాటు పెద్దదిగా కనిపిస్తుంది.
Image: Pixabay
ఇంట్లోకి వెలుగు వచ్చేలా అద్దాలను అమర్చితే ఇల్లు ప్రకాశవంతంగా మెరుస్తుంది. ఎదురెదురుగా రెండు అద్దాలు పెట్టడం వల్ల ఇల్లు పెద్దగా ఉన్న భ్రమ కలుగుతుంది.
Image: Pixabay
ఇంట్లో అన్ని ప్రదేశాల్లో వెలుగులు వచ్చేలా లైట్స్ అమర్చుకోవాలి. దీంతో ప్రతి చోట వెలుతురు చేరి ఇల్లు పెద్దగా కనిపిస్తుంది.
Image: Pixabay
వార్డ్‌రోబ్‌ను చాలా స్మార్ట్‌గా ఉపయోగించాలి. వీలైతే ఒకే వార్డ్‌రోబ్‌లో కుటుంబసభ్యులందరీ దుస్తులు వేర్వేరుగా సర్దుకుంటే.. స్థలం, డబ్బు రెండూ మిగులుతాయి.
Image: Pixabay
స్థలాన్ని బట్టి డెకరేషన్ చేసుకుంటే ఇల్లు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
Image: Pixabay