‘టెక్‌’ మెడ నొప్పి రాకుండా జాగ్రత్త పడండి!

మొబైల్‌ ఫోన్లు, ట్యాబ్లెట్లు మన మెడలను వంచేస్తున్నాయి. ఇలా గంటల కొద్దీ ఫోన్‌, ట్యాబ్‌ల వంక చూస్తూ ఉండటం మెడ నొప్పికి దారితీస్తోంది. దీన్ని టెక్‌ నెక్‌ లేదా టెక్ట్స్‌ నెక్‌ అని అంటారు.

Source: Pixabay

మనం మెడను 15 డిగ్రీలు ముందుకు వంచితే మెడ మీద 12.5 కిలోల అదనపు భారం పడుతుంది.

Source: Pixabay

అదే 30 డిగ్రీల కోణంలో వంచితే 16 కిలోలు, 60 డిగ్రీల కోణంలో వంచితే 27.2 కిలోల ఎక్కువ భారం పడుతుంది.

Source: Pixabay

దీంతో మెడ వద్ద వెన్నుపూసల మధ్య డిస్క్‌లు, చిన్న కీళ్లు త్వరగా క్షీణిస్తాయి. క్రమంగా మెడ నొప్పికి దారితీస్తుంది. ఈ నొప్పి భుజాలకు, చేతులకూ పాకుతుంటుంది.

Source: Pixabay

డిజిటల్‌ పరికరాల వాడకంతో ముడిపడిన మెడ నొప్పి వచ్చాక బాధ పడటం కన్నా నివారించుకోవటమే ఉత్తమం.

Source: Pixabay

ఫోన్లు, ట్యాబ్‌లు వాడుతున్నప్పుడు భంగిమ సరిగా ఉండేలా, మెడ మరీ కిందికి వంచకుండా చూసుకోవాలి. 10-15 నిమిషాల కన్నా ఎక్కువ సేపు మొబైల్‌ ఫోన్లు వాడకుండా చూసుకోవాలి.

Source: Pixabay

మొబైల్‌ ఫోన్లను కళ్ల ఎత్తుకు సమానంగా ఉంచి వాడితే టెక్‌ మెడ నొప్పి బారిన పడకుండా ఉండొచ్చు

Source: Pixabay

డెస్క్‌టాప్‌ వంటి పెద్ద తెర పరికరాలను వాడితే మంచిది. బల్ల మీద మొబైల్‌ స్టాండ్‌కు ఫోన్‌ను బిగించి వాడటం అలవాటు చేసుకుంటే తల మరీ వంచకుండా చూసుకోవచ్చు

Source: Pixabay

ఎక్కువ సేపు మొబైళ్లు వాడకుండా స్వీయనియంత్రణ పాటిస్తే మెడ నొప్పి ముప్పు నుంచి బయటపడొచ్చు

Source: Pixabay

అతిగా ఆలోచించకండి..

పెసరపప్పు గురించి ఇవి తెలుసా?

టైప్‌- 2 మధుమేహానికి చెక్‌ పెడదాం!

Eenadu.net Home