మీ వ్యాపారాన్ని ఇలా ప్రమోట్‌ చేసుకోండి!

గూగుల్‌ లోకల్‌ లిస్టింగ్‌


గూగుల్‌ బిజినెస్‌ ప్రొఫైల్‌ క్రియేట్‌ చేసుకోండి. దీని వల్ల గూగుల్‌ లోకల్‌ లిస్టింగ్‌లో మీ కంపెనీ చిరునామా, పనివేళలు మొదట్లోనే కనిపిస్తాయి.

Image: Unsplash

సోషల్‌మీడియా


సోషల్‌మీడియా ప్రచారంతో వ్యాపారానికి మంచి గుర్తింపు లభిస్తుంది. అందుకే అన్ని ప్లాట్‌ఫామ్స్‌లో అకౌంట్‌ తెరవాలి. ఫాలోవర్స్‌ను పెంచుకోవాలి. సోషల్‌మీడియా సెలబ్రిటీలతోనూ ప్రచారం చేయించుకోవచ్చు.

Image: Unsplash

కంటెంట్‌


మీ వ్యాపారానికి తగ్గ కస్టమర్లే లక్ష్యంగా కంటెంట్‌ క్రియేట్‌ చేయాలి. వారికి ఉపయోగపడే సమాచారాన్ని ఇస్తూనే మీ కంపెనీ గురించి వివరించాలి. వారికి మీపై నమ్మకం కలిగించాలి.

Image: Unsplash

ఆన్‌లైన్‌ పోస్టింగ్‌


సోషల్‌మీడియాలో మీ పోస్టులు నెటిజన్లను ఆకట్టుకునే విధంగా ఉండాలి. చూడచక్కని ఫొటోలు, వీడియోలు, గ్రాఫిక్స్‌ను వాడాలి. అవసరమైతే ప్రొఫెషనల్‌ డిజైనర్స్‌ను నియమించుకోవాలి.

Image: Unsplash

ఎస్‌ఈఓ


మీ కంపెనీ, వ్యాపారానికి సంబంధించిన కీలక పదాలను మీ ఆన్‌లైన్‌ పోస్టుల్లో చేర్చాలి. అప్పుడు సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌తో మీ కంపెనీ వివరాలు యూజర్లకు తొందరగా లభించే అవకాశముంది. కాబట్టి ఎస్‌ఈవో ఏజెన్సీ సహకారం తీసుకోవాలి.

Image: Unsplash

ప్రెస్‌ నోట్‌


మీ కంపెనీ ఏదైనా లక్ష్యాన్ని సాధించినప్పుడు, ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నప్పుడు, వార్షికోత్సవం ఇలా వివిధ సందర్భాల్లో స్థానిక పత్రికలకు ప్రెస్‌ నోట్‌ విడుదల చేయాలి. దీని వల్ల కంపెనీకి ప్రచారం లభిస్తుంది. 

Image: Unsplash

ఆన్‌లైన్‌ కమ్యూనిటీ


మీ వ్యాపార రంగానికి సంబంధించిన ఆన్‌లైన్‌ కమ్యూనిటీల్లో యాక్టివ్‌గా ఉండాలి. అక్కడి సభ్యులతో పరిచయాలు మీ కంపెనీ వృద్ధికి ఉపయోగపడొచ్చు.

Image: Unsplash

వివిధ మాధ్యమాల్లో ప్రచారం..


టీవీ.. రేడియో.. హోర్డింగ్స్‌ అనేవి సంప్రదాయ ప్రచార మాధ్యమాలు. డబ్బులు చెల్లించి వీటిల్లో ప్రచారం చేయించుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల ఆయా మాధ్యమాల.. ప్రేక్షకులు, శ్రోతలకు మీ కంపెనీ గురించి తెలుస్తుంది.

Image: Unsplash

కార్యక్రమాలకు స్పాన్సర్‌షిప్‌


స్థానికంగా జరిగే కార్యక్రమాలకు స్పాన్సర్‌ చేయొచ్చు. దీని వల్ల కూడా మీ కంపెనీకి ప్రచారం జరుగుతుంది.

Image: Unsplash

ఆఫర్స్‌


మీ కంపెనీ ఉత్పత్తులపై డిస్కౌంట్‌/ఉచితం వంటి ఆఫర్లను ప్రకటిస్తుండాలి. ఫ్రీ శాంపిల్స్‌ ఇవ్వడం వల్ల కస్టమర్లకు మీ ఉత్పత్తిని వాడే అవకాశం లభిస్తుంది.

Image: Unsplash

యూపీఐలో ఈ ఏడాది వచ్చిన మార్పులు

వాట్సప్‌ ఈ ఏడాది బెస్ట్‌ ఫీచర్లు ఇవీ..

స్కామర్ల కామన్‌ డైలాగ్స్‌ ఇవీ!

Eenadu.net Home