రాంగ్‌ నంబర్‌కి యూపీఐ పేమెంట్‌ చేశారా?

ఒక్కోసారి పొరపాటున రాంగ్‌ నంబర్‌కు యూపీఐ ద్వారా చెల్లింపులు చేసేస్తుంటాం. దీంతో ఆ డబ్బు ఎలా తిరిగి పొందాలో తెలియక తికమకపడుతుంటాం.

ఒకవేళ అలా రాంగ్‌ పేమెంట్‌ చేస్తే ఆ డబ్బు తిరిగి పొందేందుకు కొన్ని మార్గాలున్నాయి. ఇందుకోసం సదరు లావాదేవీల వివరాలను భద్రపరచుకోవాల్సి ఉంటుంది. ఆ మార్గాలివీ..

నేరుగా వ్యక్తిని సంప్రదించి విషయం తెలియజేయాలి. పేమెంట్‌ వివరాలు చూపించి మీ డబ్బును తిరిగి ఇవ్వాలని అడగాలి.

మీరు ఏ యాప్‌ ద్వారా పేమెంట్‌ లావాదేవీ జరిపారో సదరు యాప్‌ కస్టమర్‌ కేర్‌ను సంప్రదించి విషయం తెలియజేయండి. సాక్ష్యాలు చూపించగానే రిఫండ్‌ ప్రాసెసర్‌ గురించి వాళ్లు మీకు సమాచారం అందిస్తారు.

కస్టమర్‌ కేర్‌ సాయంతో మీ సమస్యకు పరిష్కారం లభించకపోతే నేరుగా ఎన్‌పీసీఐలో ఫిర్యాదు చేయండి. మీ డబ్బు తిరిగి రప్పించేందుకు వీళ్లు సాయం చేస్తారు.

లావాదేవీకి సంబంధించి విషయాన్ని మీ బ్యాంక్‌లో తెలియజేసి సాయం కోరండి. బ్యాంక్‌కు అడిగే అన్ని వివరాలు, పత్రాలు అందించగానే రిఫండ్‌ కోసం ఛార్జ్‌బ్యాక్‌ ప్రక్రియను మొదలుపెడతారు.

చివరగా టోల్​ఫ్రీ నంబర్​1800-120-1740కు కాల్‌ చేసి ఫిర్యాదు చేయొచ్చు.

ఆర్‌బీఐ తీసుకొచ్చిన కొత్త నిబంధనల ప్రకారం పొరపాటున వేరే వ్యక్తులకు డబ్బులు పంపితే ఆ మొత్తం 48 గంటల్లోపే తిరిగి పొందొచ్చు. లావాదేవీలు జరిపిన ఇద్దరు వ్యక్తులవి వేర్వేరు బ్యాంకులైతే మాత్రం ఈ ప్రక్రియ కాస్త ఆలస్యం అవుతుంది.

వీళ్లు ట్యాక్స్‌ ఎంత కడుతున్నారో తెలుసా?

మెటల్‌ మెరుపులు అద్దుకున్న క్రెడిట్‌ కార్డులివే

భారత్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లు ఇవే!

Eenadu.net Home