IRCTC లాగిన్‌ వివరాలు మర్చిపోయారా?

 ట్రైన్‌ టికెట్‌ బుక్‌ చేసుకునేందుకు ఐఆర్‌సీటీసీ అకౌంట్‌ తప్పనిసరి. ఒక్కోసారి లాగిన్‌ వివరాలు మరిచిపోతుంటాం. అప్పుడెలా?

ఐఆర్‌సీటీసీ అకౌంట్‌ వివరాలు మరిచిపోతే ఇ-మెయిల్‌ ఐడీతో సులువుగా రికవర్‌ చేయొచ్చు. 

ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లాలి. లాగిన్‌ అయ్యే ముందు కనిపించే Forgot account detailsపై క్లిక్‌ చేయాలి.

ఐఆర్‌సీటీసీ యూజర్‌ఐడీ/ఇ-మెయిల్‌ ఐడీ, క్యాప్చా ఎంటర్‌ చేసి Nextపై క్లిక్‌ చేయాలి.

వెంటనే రిజిస్ట్రేషన్‌ మొబైల్‌ నంబర్‌ లేదా ఇ-మెయిల్‌కి ఓటీపీ వస్తుంది. 

ఆ ఓటీపీని ఎంటర్ చేసి కొత్త పాస్‌వర్డ్‌ని క్రియేట్‌ చేసుకోవాలి.

ఆ పాస్‌వర్డ్‌ని కన్ఫార్మ్‌ చేసుకొని క్యాప్చా ఎంటర్‌ చేసి update passwordపై క్లిక్‌ చేయాలి.

వెంటనే కొత్త పాస్‌వర్డ్‌ ఆటోమేటిక్‌గా అప్‌డేట్‌ అవుతుంది.

సామాజిక మాధ్యమాలను సానుకూలంగానూ ఉపయోగించొచ్చు..

లింక్డిన్‌ ప్రొఫైల్‌ ఆకర్షణీయంగా రూపొందించాలా?

పిల్లలు విసిగిస్తున్నారని ఫోన్ ఇస్తున్నారా?

Eenadu.net Home