నోటి దుర్వాసన పోవాలంటే..

రోజూ రెండుసార్లు బ్రష్‌ చేసుకోవాలి. టంగ్‌ క్లీనర్‌తో నోరు శుభ్రం చేసుకుంటే మంచిది.

Image: Pixabay

ఆహారం తీసుకున్న తర్వాత పళ్లలో పాచి వంటివి ఏమైనా ఉంటే తొలగించుకోవాలి.

Image: Pixabay

లవంగాలు, యాలకులు, సొంపు వంటి సుగంధద్రవ్యాలను నమలడం ద్వారా నోటి దుర్వాసన రాకుండా చేయొచ్చు.

Image: Pixabay

పెరుగు.. నోట్లోని బ్యాక్టీరియాను చంపి దుర్వాసన రాకుండా చేస్తుంది. ఉప్పు వేసుకోకుండా పెరుగు తింటే మంచి ఫలితముంటుంది.

Image: Pixabay

భోజనం చేసిన తర్వాత సిట్రిక్‌ యాసిడ్‌ ఉండే పండ్లను తింటే.. నోట్లో బ్యాక్టీరియా అంతం కావడంతోపాటు దుర్వాసన రాకుండా ఉంటుంది.

Image: Pixabay

కాఫీ/టీ బదులు గ్రీన్‌ టీ తాగండి. ఇది శ్వాసను మెరుగుపరుస్తుంది.

Image: Pixabay

ఉప్పు లేదా పసుపు కలిపిన నీటితో పుక్కిలిస్తే నోటి నుంచి దుర్వాసన రాదు.

Image: Pixabay

ఆపిల్‌ ముక్కలను తినడం వల్ల కూడా దుర్వాసన రాదు.

Image: Pixabay

మార్కెట్లో మౌత్‌వాష్‌ లిక్విడ్స్‌ లభిస్తాయి. వాటితో నోరు శుభ్రం చేసుకున్నా దుర్వాసన పోతుంది.

Image: Pixabay

చూయింగ్‌గమ్‌లను నమలడం వల్ల కూడా నోటి దుర్వాసనకు చెక్‌ పెట్టొచ్చు.

Image: Pixabay

ప్రపంచంలో సురక్షితమైన నగరాలు ఇవే!

కళ్ల కింద క్యారీ బ్యాగులా? ఈ టిప్స్‌ ట్రై చేయండి!

నెంబర్‌ ప్లేట్లు ఇన్ని రకాలున్నాయా?

Eenadu.net Home