జలుబుకు చెక్‌ పెట్టండిలా!

జలుబు చేసినప్పుడు బాగా వేడి చేసి చల్లార్చిన నీటినే తాగాలి.

Source: Unsplash

నల్లమిరియాలు, తేనె, టీస్పూన్‌ పసుపు కలిపిన మిశ్రమం తీసుకోవాలి.

Source: Unsplash

వేడి నీటిలో పసుపు, నొప్పిని నివారించే బామ్‌ కలిపి ఆవిరి పట్టడం వల్ల జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది.

Source: Unsplash

రాత్రివేళ వేడి పాలల్లో పసుపు కలుపుకొని తాగండి. చక్కగా నిద్ర పట్టడంతోపాటు జలుబు తగ్గుతుంది.

Source: Unsplash

జలుబు ఉన్నప్పుడు అల్లం టీ తాగితే మంచి ఫలితం ఉంటుంది.

Source: Unsplash

రోజూ తులసి ఆకుల్ని నమలడం వల్ల జలుబు తగ్గడంతోపాటు నోటి దుర్వాసన పోతుంది.

Source: Unsplash

కొన్ని మిరియాలు వేసిన పాలు లేదా మిరియాల కషాయం తాగినా జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది.

Source: Unsplash

అల్లం, వెల్లుల్లి, వాము, మెంతులు, మిరియాలు వేసి తయారు చేసిన సూప్స్‌ తాగడం వల్ల కూడా జలుబు తగ్గుతుంది.

Source: Unsplash

అవిసెలతో అనేక లాభాలు

ఇమ్యూనిటీని పెంచే డ్రింకులివి!

పదే పదే తీపి తినాలనిపిస్తుందా..!

Eenadu.net Home