మలబద్ధకం.. పోవాలంటే..?

మలబద్ధకం వల్ల కడుపులో అసౌకర్యంగా, ఇబ్బందిగా ఉంటుంది. అంతేకాదు, మలద్వారం కోసుకుపోవడం, రక్తస్రావం, పైల్స్‌ ఏర్పడే అవకాశముంది. మరి దీన్ని ఎలా నివారించాలంటే..

Source: Eenadu

పరగడుపున గోరువెచ్చని నీరు తాగాలి.

Source: Unsplash

ఎక్కువగా పీచు పదార్థాలు తీసుకోవాలి. యాపిల్‌లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.

Source: Unsplash

ఆకుకూరలు ముఖ్యంగా తోటకూర రోజూ తింటే మలబద్ధకం దరిచేరదు.

Source: Unsplash

వంటలో నూనె వాడకం తగ్గించాలి.

Source: Unsplash

నీళ్లు ఎక్కువగా తాగాలి. క్యారెట్‌, క్యాబేజీ, ద్రాక్ష పండ్లను జ్యూస్‌గా తాగితే మలబద్ధకం తగ్గుతుంది.

Source: Unsplash

కరివేపాకు పొడిని తేనెతో కలిపి తీసుకున్నా ఫలితం ఉంటుంది.

Source: Unsplash

మలబద్ధకానికి ‘మలాసనం’ చక్కటి పరిష్కారం. ఈ ఆసనం వేయడం వల్ల విసర్జన సాఫీగా జరుగుతుంది.

Source: Unsplash

రోజూ ఉదయం నడక, వ్యాయామం వల్ల మలబద్ధకం సమస్యను అధిగమించవచ్చు.

Source: Unsplash

మామిడి పండు తింటే మొటిమలు వస్తాయా..!

పుచ్చకాయతో లాభాలెన్నో...

మే 17న హైపర్‌ టెన్షన్‌ డే

Eenadu.net Home