కళ్ల కింద క్యారీ బ్యాగులా? ఈ టిప్స్ ట్రై చేయండి!
రోజూ రాత్రి నిద్రపోయే ముందు కొబ్బరి/ ఆముదం/ బాదం నూనెతో కళ్ల కింద మృదువుగా మర్దన చేసుకోవాలి.
Image: Unsplash
అవకాడో పండును పేస్ట్‌లా చేసుకుని అందులో తేనె కలిపి కళ్ల కింద అప్లై చేయాలి. పావుగంట తర్వాత చల్లటి నీళ్లతో కడగాలి.
Image: Unsplash
బంగాళదుంపను ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టాలి. చల్లగా అయ్యాక వాటిని కళ్ల కింద పది నిమిషాల పాటు రుద్దాలి. అనంతరం చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
Image: Unsplash
కీరదోసలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ కళ్ల కింద ముడతలను తగ్గించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. చల్లగా ఉండే కీరదోస ముక్కలను కళ్లపై రుద్దుకుంటే సరి.
Image: Unsplash
టమాటోలో ఉండే లైకోపీన్ చర్మాన్ని మృదువుగా ఉంచడంతోపాటు ముడతలకు చెక్ పెడుతుంది. టమాటో రసం/ముక్కలతో కళ్ల కింద భాగంలో మర్దన చేస్తే ఫలితముంటుంది.
Image: Unsplash
గుడ్డులోని తెల్లసొనని కళ్ల కింద రాసుకోవాలి. అది ఆరిపోయిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
Image: Unsplash
రోజ్ వాటర్‌లో దూదిని ముంచి అప్పుడప్పుడు కళ్ల కింద తుడుస్తూ ఉంటే నల్ల మచ్చలు, ముడతలు క్రమంగా తగ్గిపోతాయి.
Image: Unsplash
కనీసం 6-8 గంటలు నిద్ర పోవాలి. ఎ, సి, ఇ విటమిన్లు ఎక్కువ ఉండే ఆహారం తీసుకోవాలి.
Image: Unsplash
వీలైనంత ఎక్కువ నీరు తాగాలి. ఇది శరీరం డీహైడ్రేషన్‌కు గురి కాకుండా కాపాడటమే కాదు, చర్మం ముడతలు పడకుండా చేస్తుంది. Image: Unsplash