గురక తగ్గాలంటే ఇలా చేయండి!

అధిక బరువు గురకకు కారణం కావొచ్చు. ఎక్కువ బరువు ఉన్న వాళ్లలో కొవ్వు గొంతు భాగంలో పేరుకుపోయి గాలి తీసుకునే మార్గాన్ని చిన్నగా చేయడం వల్ల గురక వస్తుంది.

Source: Pixabay

నిద్రించే భంగిమను మార్చుకుంటే గురక రాకుండా ఉంటుంది. వెల్లికిలా పడుకోవడం వల్ల గాలి తీసుకునే మార్గాలకు అడ్డంకి ఏర్పడి గురక వస్తుంది. అందువల్ల ఓ పక్కకు పడుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

Source: Pixabay

ఒక వేళ మీకు మద్యం, సిగరెట్లు తాగడం వంటి అలవాట్లు ఉంటే తగ్గించుకోవాలి. పడుకునే ముందు కచ్చితంగా మద్యానికి దూరంగా ఉండాలి. నిద్రించే ముందు మద్యం తీసుకుంటే గొంతు కండరాలు విశ్రాంతి తీసుకోవడంతో గురక వస్తుంది.

Source: Pixabay

గురక వచ్చే వారు ఎక్కువగా నీరు తీసుకోవాలి. సరిగా నీళ్లు తాగకపోతే డీహైడ్రేషన్‌కు గురై.. ముక్కు రంధ్రాల్లో శ్లేష్మం ఏర్పడి గురక వస్తుంది.

Source: Pixabay 

పొడి గాలి పీల్చడం కూడా గురకకు కారణం కావొచ్చు. అందువల్ల తేమతో కూడిన గాలిని అందించే ఎలక్ట్రానిక్‌ పరికరాలు (హ్యూమిడిఫైయర్లు) గదిలో ఏర్పాటు చేసుకుంటే మంచిది.

Source: Pixabay

నాలుక, గొంతు కండరాలు విశ్రాంతి తీసుకోవడం వల్లే ముఖ్యంగా గురక వస్తుంది. అందువల్ల పాటలు పాడటం, నాలుకకు సంబంధించిన ఎక్సర్‌సైజ్‌లు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

Source: Pixabay

డెయిరీ ఉత్పత్తుల వల్ల ముక్కు, గొంతులో కణజాలం పెరిగి గురకకు కారణం కావొచ్చు. అందువల్ల వాటిని తగ్గిస్తే ఫలితం ఉంటుంది.

Source: Pixabay

పడుకునే ముందు ఆవిరి పట్టడం గానీ, వేడి నీటితో స్నానం చేయడం వల్ల గురక తగ్గేందుకు అవకాశం ఉంటుంది.

Source: Pixabay

నిద్రలేమి వల్ల కూడా గురక వచ్చే అవకాశం ఉంది. అందువల్ల 7 నుంచి 9 గంటల నిద్ర అవసరం. నిద్ర సరిగా రానివాళ్లు నిద్ర మాత్రల వైపు కాకుండా సాధారణ ఇంటి చిట్కాలు పాటిస్తే మంచిది.

Source: Pixabay

అవిసెలతో అనేక లాభాలు

ఇమ్యూనిటీని పెంచే డ్రింకులివి!

పదే పదే తీపి తినాలనిపిస్తుందా..!

Eenadu.net Home