చలికాలం మొదలైంది..! జాగ్రత్త సుమండీ!

చలికాలంలో వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉంటుంది. అందుకే, చిన్న పిల్లలు.. వృద్ధుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. వారిని చలిలో తిరగనివ్వొద్దు. 

Image: RKC

ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం తినొద్దు. ఎప్పటికప్పుడు వేడి వేడి ఆహారమే తినాలి. 

Image: RKC

వెచ్చదనం కోసం టీ/కాఫీలకు బదులు గ్రీ టీ తాగండి. దీంతో వెచ్చదనంతోపాటు ఆరోగ్యమూ బాగుంటుంది.

Image: RKC

ఈ కాలంలో దగ్గు, జలుబు, జ్వరం తరచూ వేధిస్తుంటాయి. వీటిని అడ్డుకోవాలంటే ఇంట్లో పరిశుభ్రత పాటించాలి. 

Image: RKC

చలి కాలంలో వ్యాధి నిరోధకతను పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇందుకు పోషకాహారంతోపాటు విటమిన్‌ సి ఎక్కువగా ఉండే పండ్లు రోజూ తీసుకోవాలి.

Image: RKC

బయట లభించే ఆహారం తింటే వ్యాధుల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సాధ్యమైనంత వరకు ఇంట్లోనే వండుకొని తినాలి.

Image: RKC

చలిని తట్టుకోవాలంటే ఉన్ని దుస్తులు ధరించాలి. వృద్ధులకు ఇది కష్టకాలం కాబట్టి.. వారికి రగ్గులు, వెచ్చగా ఉండే దుప్పట్లు కప్పుకోమని చెప్పాలి.

Image: RKC

ప్రయాణం చేసినపుడు, పనిపై బయటకు వెళ్లినపుడు చేతులకు గ్లౌజులు, కాళ్లకు సాక్స్‌లు, తలకు మంకీక్యాప్‌తో పాటు చెవిలో దూది పెట్టుకోవాలి.

Image: RKC

చల్లని నీళ్లతో కాకుండా.. గోరు వెచ్చని నీళ్లతో స్నానం చేయాలి. ఆ తర్వాత మాయిశ్చరైజర్‌ రాసుకోవడం మర్చిపోవద్దు. లేదంటే చర్మం పొడిబారిపోతుంది. 

Image: RKC

చలితో పెదాలు పగిలిపోతుంటాయి. అలా జరగకూడదంటే.. లిప్‌బామ్స్‌ లేదా వెన్నను పడుకునే సమయంలో పెదవులకు రుద్దుకోవాలి. 

Image: RKC

సాయంత్రం కాగానే ఇంటి తలుపులు, కిటికీలు మూసివేయాలి. ఏసీ వాడకూడదు. తొందరగా తినేసి దుప్పటి కప్పుకొని నిద్రిస్తే హాయిగా నిద్ర పడుతుంది. 

Image: RKC

ఎక్కువగా చలి మంటలు వేసుకోవద్దు. ఆ వేడి వల్ల చర్మం దెబ్బతినడమే కాదు.. ప్రమాదాలూ జరగొచ్చు.

Image: RKC

రాష్ట్రానికో ఫేమస్‌ రైస్‌ డిష్‌!

ప్రపంచంలోని టాప్‌-10 ప్రశాంతమైన దేశాలివే!

ప్రపంచంలోనే ఎక్కువ సమయం పట్టే విమాన ప్రయాణాలు

Eenadu.net Home