ముఖంపై జిడ్డు పోయేదెలా?

పసుపు, పాలు కలిపిన మిశ్రమాన్ని ముఖం, మెడకు రాసుకొని పావుగంట ఆగి కడిగేయాలి. రోజూ రాత్రివేళ ఇలా చేస్తూ ఉంటే ముఖంపై జిడ్డు తొలగిపోతుంది.

Image: RKC

రోజ్‌వాటర్‌లో దూదిని ముంచి.. దానితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. దీంతో ముఖంపై జిడ్డు తగ్గి చర్మం మృదువుగా కనిపిస్తుంది.

Image: RKC

చందనం, ముల్తానీ మట్టిలో రోజ్‌ వాటర్‌ కలిపి ఫేస్‌ ప్యాక్‌ తయారు చేసుకోవాలి. దాన్ని ముఖంపై అప్లై చేసి 20 నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కడిగేస్తే జిడ్డు తొలగిపోతుంది.

Image: RKC

నిమ్మరసంలో బేకింగ్‌ సోడా కలిపి.. ఆ మిశ్రమాన్ని ముఖంపై పూతలా వేసి మర్దన చేయాలి. ఇలా చేస్తే నూనె గ్రంథులు మూసుకుపోయి జిడ్డు సమస్య తగ్గుతుంది.

Image: RKC

టమాటో ముక్కతో ముఖంపై మర్దన చేసి పావుగంట తర్వాత చల్లటి నీటితో కడుక్కుంటే జిడ్డు పోతుంది. టమాటో ముక్కలపై తేనె వేసి మర్దన చేసుకుంటే చర్మం అందంగా కనిపిస్తుంది.

Image: RKC

ముఖాన్ని శుభ్రం చేసుకొని మొక్కజొన్న పిండి.. నీళ్లు కలిపిన మిశ్రమాన్ని పూతలా వేసుకోవాలి. పావుగంట తర్వాత కడిగేసుకోవాలి. ఈ పిండి ముఖంపై పేరుకున్న జిడ్డును తొలగిస్తుంది.

Image: RKC

యాపిల్‌ గుజ్జులో పెరుగు, నిమ్మరసం కలిపి.. ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకుంటే ముఖంపై జిడ్డు పేరుకుపోదు.

Image: RKC

ఉప్పు కలిపిన నీళ్లను తరచూ ముఖంపై స్ప్రే చేసుకొని తుడుచుకోవాలి. ఈ నీళ్లతో జిడ్డు సమస్య క్రమంగా తగ్గుముఖం పడుతుంది.

Image: RKC

ముఖాన్ని రోజుకు మూడు, నాలుగు సార్లు కడుగుతూ ఉండాలి. దీంతో అదనంగా వచ్చి చేరే జిడ్డును నివారించవచ్చు.

Image: RKC

ముఖంపై పేరుకుపోయే జిడ్డును ఎప్పటికప్పుడు తొలగించడానికి బ్లాటింగ్‌ పేపర్స్‌ను వెంట ఉంచుకోవాలి. ఈ పేపర్‌ ముఖంపై జిడ్డును పీల్చుకుంటుంది.

Image: RKC

సైకత శిల్పాలతో గోల్డ్‌ మెడల్‌

వర్షాకాలంలో రోడ్‌ ట్రిప్‌.. ఈ దారుల్లో అద్భుతం..

ఒత్తిడిని జయించేందుకు నిపుణుల సలహాలివే..!

Eenadu.net Home