ఫేక్‌ కాల్స్‌కు ‘చక్షు’తో చెక్‌

సాంకేతికతతోపాటు సైబర్‌ మోసాలూ పెరుగుతున్నాయి. వీటిని అరికట్టేందుకు టెలికాం విభాగం తీసుకొచ్చిన సరికొత్త పోర్టల్‌.. ‘చక్షు’.

మోసపూరిత కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌, వాట్సప్‌ మెసేజెస్‌ వచ్చినట్లయితే.. వాటి గురించి ఈ పోర్టల్‌ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు.

ముందుగా sancharsaathi.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి కిందకు స్క్రోల్‌ చేస్తే సిటిజన్‌ సెంట్రిక్‌ సర్వీసెస్‌ సెక్షన్‌ కనిపిస్తుంది.

అందులో ‘చక్షు’ ఆప్షన్‌ను ఎంచుకొని నకిలీ కాల్స్‌, మెసేజ్‌, వాట్సప్‌.. ఇలా మీకు ఏ ప్లాట్‌ఫామ్‌ ద్వారా ఫేక్‌ సమాచారం వచ్చిందో ఎంచుకోవాలి.

కిందున్న డ్రాప్‌ డౌన్‌ మెనూలోంచి ఎలాంటి మోసమో ఎంచుకొని, సంబంధిత స్క్రీన్‌ షాట్‌ను అటాచ్‌ చేయాలి.

ఆ తర్వాత ఫేక్‌ కాల్‌కు సంబంధించి ఫోన్‌ నంబర్‌, కాల్‌ వచ్చిన తేదీ, సమయాన్ని నమోదు చేయాలి. మోసం జరిగిన తీరును వివరించొచ్చు.

ఫిర్యాదుకు సంబంధించిన వివరాలు నమోదు చేసిన తర్వాత వ్యక్తిగత వివరాలు తెలియజేసి ఓటీపీతో ధ్రువీకరించాలి.

 మీరిచ్చిన ఫిర్యాదుపై ప్రభుత్వం సైబర్‌ నిపుణులతో దర్యాప్తు చేపట్టి.. అలాంటి నకిలీ కాల్స్‌ను అరికడుతుంది. 

అక్టోబర్‌లో రానున్న ఫోన్లు ఇవే..!

లింక్డిన్‌ ప్రొఫైల్‌ ఆకర్షణీయంగా రూపొందించాలా?

శాటిలైట్‌ నావిగేషన్‌ వ్యవస్థలివీ!

Eenadu.net Home