క్రెడిట్‌ కార్డు.. డెబిట్‌ కార్డు.. ఏది ఎప్పుడు వాడాలి?

నగదురహిత లావాదేవీల్లో విరివిగా డెబిట్‌, క్రెడిట్‌కార్డులను వాడుతుంటాం. కానీ, వాటిలో దేన్ని ఎప్పుడు వాడాలో తెలుసుకోవడమూ ముఖ్యమే. సందర్భానుసారంగా వాటిని వాడితే మంచి ఉపయోగాలుంటాయి. 

Image: RKC

క్రెడిట్‌ కార్డు

చేతిలో, బ్యాంక్‌ ఖాతాలో డబ్బు లేనప్పుడు క్రెడిట్‌ కార్డు వాడొచ్చు. అయితే, ఇచ్చిన గడువులోపు తిరిగి చెల్లించగలను అన్న ధీమా ఉంటేనే వినియోగించాలి.

Image: RKC

ఆన్‌లైన్‌ కొనుగోళ్లలో క్రెడిట్‌కార్డును ఉపయోగించడం ఉత్తమం. అదీ తక్కువ పరిమితి ఉన్న కార్డును వాడితే మంచిది.

Image: RKC

ఒక వస్తువును మొత్తం ధర చెల్లించి కొనలేక.. ఈఎంఐలో తీసుకుంటుంటారు. అలా ఈఎంఐలో తీసుకునేటప్పుడు క్రెడిట్ కార్డునే వాడండి. దానికంటే ముందు ప్రాసెసింగ్‌ ఫీజు, సున్నా వడ్డీ వంటి వాటిపై ఆరా తీయాలి.

Image: RKC

ఈ-కామర్స్‌ వెబ్‌సైట్స్‌ చాలా వరకు క్రెడిట్‌ కార్డులపై డిస్కౌంట్‌, క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. అలాంటప్పుడు క్రెడిట్‌ కార్డును వాడొచ్చు. కానీ, కేవలం ఆఫర్స్‌ కోసమే అనవసర కొనుగోళ్లు చేయకూడదు.

Image: RKC

క్రెడిట్‌ స్కోర్‌పై క్రెడిట్‌ కార్డు ప్రభావం ఉంటుంది. కాబట్టి.. ప్రతి నెలా క్రెడిట్‌కార్డు వాడి.. సకాలంలో చెల్లిస్తూ ఉంటే స్కోర్‌ మెరుగవుతుంది. తద్వారా భవిష్యత్తులో రుణాల మంజూరు సులభమవుతుంది. 

Image: RKC

అత్యవసరం అనిపించినప్పుడు క్రెడిట్‌ కార్డును ఉపయోగించి ఏటీఎం ద్వారా నగదు తీసుకోవచ్చు. కానీ, దానిపై భారీ మొత్తంలో వడ్డీ ఉంటుంది. వీలైనంత వరకు క్రెడిట్‌ కార్డుతో నగదు విత్‌డ్రా చేయకుండా ఉండటానికి ప్రయత్నించండి.

Image: RKC

డెబిట్‌ కార్డు

మన బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బును వాడుకోవడానికే డెబిట్‌ కార్డును వాడతాం. నగదు అవసరమైనప్పుడు ఈ కార్డును ఉపయోగించి ఏటీఎం ద్వారా నగదు విత్‌డ్రా చేస్తాం. 

Image: RKC

అందరికీ నెలవారీ నిర్దిష్టమైన ఖర్చులు ఉంటాయి. అలాంటి వాటికి డెబిట్‌ కార్డును ఉపయోగించి చెల్లింపులు జరపాలి.

Image: RKC

షాపింగ్‌ కోసం ముందుగానే డబ్బును పొదుపు చేసి ఉంటే.. దాన్ని డెబిట్‌ కార్డు ద్వారా ఖర్చు చేసుకోవచ్చు. 

Image: RKC

క్రెడిట్‌ కార్డు వాడి అనవసరంగా అప్పులపాలు కాకూడదు అనుకుంటే.. ఖాతాలో డబ్బును డెబిట్‌ కార్డుతో వాడుకోవాలి.

Image: RKC

ఏదేమైనా.. ఇవి సూచనలు మాత్రమే. ఏ కార్డును ఎప్పుడు వాడాలన్నది వ్యక్తి విచక్షణ, ఆర్థిక క్రమశిక్షణపై ఆధారపడి ఉంటుంది.

Image: RKC

బడ్జెట్‌ - 2023: ఏ శాఖకు ఎంత?

కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గాలివే..!

బడ్జెట్‌ రూపకల్పన ఇలా..

Eenadu.net Home