ఏటీఎమ్‌ కార్డు లేకుండా నగదు విత్‌డ్రా ఎలా!

ఎస్‌బీఐ


యోనో యాప్‌లో ఏటీఎమ్ సెక్ష‌న్‌ను ఎంచుకొని విత్‌డ్రా మొత్తాన్ని ఎంట‌ర్ చేయాలి. రిజిస్ట‌ర్డ్ మొబైల్ నెంబ‌రుకు యోనో క్యాష్ ట్రాన్సాక్షన్‌ నెంబరు పంపిస్తుంది. 

Source: SBI

ఈ నెంబ‌రు, పిన్ నెంబ‌ర్ల‌తో విత్‌డ్రా చేయొచ్చు. ఏటీఎమ్ వద్ద కార్డ్ లెస్ ట్రాన్సాక్షన్‌ ఆప్ష‌న్‌ను ఎంచుకొని.. యోనో క్యాష్‌ను సెల‌క్ట్ చేసి న‌గ‌దు విత్‌డ్రా చేసుకోవ‌చ్చు.

Source: Pixabay

ఐసీఐసీఐ బ్యాంక్..


‘iMobile'యాప్‌లో 'స‌ర్వీసెస్' ఆప్ష‌న్‌లో ఉన్న 'క్యాష్ విత్‌డ్రా ఎట్ ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎమ్' ను క్లిక్ చేయాలి. విత్‌డ్రా మొత్తంతో పాటు, ఖాతా నెంబ‌రు.. తాత్కాలిక పిన్‌లను సెల‌క్ట్ చేస్తే ఓటీపీ వ‌స్తుంది.

Source: ICICI

ఏటీఎమ్ వ‌ద్ద కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాను సెల‌క్ట్ చేసి.. ఓటీపీ నెంబ‌రు, తాత్కాలిక పిన్ నెంబ‌రు, విత్‌డ్రా అమౌంట్‌ని ఎంట‌ర్ చేసి డ్రా చేసుకోవ‌చ్చు.

Source: Eenadu

బ్యాంక్ ఆఫ్ బ‌రోడా..


బీఓబీ మొబైల్ బ్యాంకింగ్‌కి లాగిన్‌ అయి.. ప్రీమియం స‌ర్వీసెస్ టాబ్‌పై క్లిక్ చేయాలి.

Source: BOB

ఇందులో క్యాష్ ఆన్ మొబైల్ స‌ర్వీసెస్‌పై టాప్ చేసి వివరాలు నమోదు చేస్తే ఓటీపీ వ‌స్తుంది. ఏటీఎమ్‌కి వెళ్లి క్యాష్ ఆన్ మొబైల్ ఆప్ష‌న్‌పై క్లిక్ చేసి ఓటీపీతో విత్‌డ్రా చేసుకోవ‌చ్చు.

Source:Eenadu

కోటక్ మ‌హీంద్రా బ్యాంక్..


కోటక్ నెట్ బ్యాంకింగ్ లేదా మొబైల్ యాప్‌కి లాగిన్ చేసి వివ‌రాల‌ను ఎంట‌ర్ చేయాలి. 

Source: Kotak Mahindra

ఏటీఎమ్ వ‌ద్ద స్క్రీన్‌పైన కార్డ్ లెస్ క్యాష్ విత్‌డ్రా లేదా ఇన్‌స్టెంట్ మ‌నీ ట్రాన్స్‌ఫ‌ర్ ఆన్ ది ఆప్ష‌న్‌ను ఎంపిక చేసుకుని, న‌గ‌దు విత్‌డ్రా చేసుకోవ‌చ్చు.

Source: Pixabay

ఆర్‌బీఎల్ బ్యాంక్ ..


ఖాతాదారులు IMT ఫంక్షన్‌కు మద్దతు ఇచ్చే ఏటీఎమ్‌ వద్ద మొబైల్ నంబర్‌తో నగదు డ్రా చేయొచ్చు. ముందుగా ఆర్‌బీఎల్ బ్యాంక్ ఎమ్ఓబ్యాంక్ యాప్‌కి లాగిన్ అవ్వాలి.

Source: RBL

యూపీఐలో ఈ ఏడాది వచ్చిన మార్పులు

వాట్సప్‌ ఈ ఏడాది బెస్ట్‌ ఫీచర్లు ఇవీ..

స్కామర్ల కామన్‌ డైలాగ్స్‌ ఇవీ!

Eenadu.net Home