హ్యూమా ఖురేషీ.. అందం ‘డబుల్ ఎక్స్‌ఎల్’
ఈ ఏడాది ఆరంభంలో ‘వలిమై’తో సందడి చేసిన హ్యుమా ఖురేషి ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను ముందుకొచ్చింది.
Image:Instagram
హ్యూమా ఖురేషీ, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో నటించిన ‘డబుల్ ఎక్స్‌ఎల్’ నవంబర్ 4న విడుదలైంది.
Image:Instagram
సతరమ్ రమానీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సోనాక్షి, హ్యూమా ఖురేషి బొద్దుగా ఉండే అమ్మాయిల్లా కన్పించారు.
Image:Instagram
‘డబుల్ ఎక్స్‌ఎల్’లో టీమ్‌ఇండియా స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్ అతిథి పాత్రలో నటించాడు. ధావన్.. హ్యూమాతో కలిసి డ్యాన్స్ చేశాడు.
Image:Instagram
హ్యూమా ఖురేషి 1986 జులై 28న దిల్లీలో జన్మించింది. యూనివర్సిటీ ఆఫ్ దిల్లీ పరిధిలోని గార్గి కాలేజీలో హిస్టరీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసింది.
Image:Instagram
తొలుత పలు టీవీ ప్రకటనల్లో నటించిన ఈ భామ.. ‘గ్యాంగ్స్ ఆఫ్ వస్సీపూర్’(2012)తో తొలిసారి వెండితెరపై మెరిసింది.
Image:Instagram
‘హైవే’తో మరాఠీ, ‘కాలా’తో తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ‘వైట్’ అనే మలయాళ చిత్రంలోనూ నటించింది.
Image:Instagram
ఈ బ్యూటీ జాక్ స్నైడర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్మీ ఆఫ్ ది డెడ్’ (అమెరికన్ చిత్రం)లోనూ తళుక్కుమంది.
Image:Instagram
ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన ‘గంగూబాయి కాఠియావాడి’లో ఓ ప్రత్యేక గీతంలో మెరిసింది.
Image:Instagram
హ్యూమా ఖురేషి సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ అప్‌డేట్స్‌ని అభిమానులతో పంచుకుంటుంది.
Image:Instagram
ఈమెకి ఇన్‌స్టాగ్రామ్‌లో 6 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ఖురేషి నటించిన మరో మూడు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
Image:Instagram