ఈ బుల్లి డివైజ్‌తో మీ పనులు మరింత స్మార్ట్‌..

This browser does not support the video element.

హ్యూమన్‌ ఏఐ పిన్‌.. స్మార్ట్‌ఫోన్‌కు సవాలు విసురుతోంది. ఫోన్‌ చేయగలిగే అన్ని పనులూ చేసేస్తూ ఔరా అనిపించేలా ఓ డివైజ్‌ను ఆవిష్కరించింది.

 కాల్స్‌, మెసేజెస్‌

ఈ బుల్లి డివైజ్‌ను మొబైల్‌లానే కాల్స్‌, మెసేజ్‌లకు వినియోగించుకోవచ్చు. వాయిస్‌ కమాండ్‌ ద్వారా కాల్స్‌ చేయొచ్చు.

అరచేతిలో సమాచారం

స్టాక్‌ మార్కెట్‌, క్రికెట్‌ స్కోర్‌.. ఇలా ఏదైనా సమాచారాన్ని ఇందులోని ప్రొజెక్టర్‌ సాయంతో అప్పటికప్పుడు అరచేతినే డిస్‌ప్లేగా మార్చుకోవచ్చు.

This browser does not support the video element.

రిమైండర్‌ సెట్‌

మన స్మార్ట్‌ ఫంక్షన్‌లో నోట్స్‌లాంటి ఆ ఫీచర్‌ ఇందులోనూ ఉంది. కావాలనుకుంటే రిమైండర్లు సైతం సెట్‌ చేసుకోవచ్చు.

లైవ్‌ ట్రాన్స్‌లేట్‌

ఏఐ పిన్‌ 50 భాషలకు సపోర్ట్‌ చేస్తుంది. ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు లైవ్‌లో ట్రాన్స్‌లేషన్ చేసేస్తుంది.

This browser does not support the video element.

వెబ్‌ సెర్చ్‌

ఏదైనా సమాచారం కావాలంటే ఇంటర్నెట్‌లోని సమాచారం అందిస్తుంది, అవసరమైతే విషయాన్ని క్లుప్తంగా ఇస్తుంది.

ఇమేజ్‌ రికగ్నిషన్‌

ఏదైనా ఇమేజ్‌ను క్యాప్చర్‌ చేస్తే చాలు.. దానికి సంబంధించిన పుట్టుపూర్వోత్తరాలన్నీ ఈ ఏఐ పిన్‌ తెలియజేస్తుంది. 

This browser does not support the video element.

కెమెరా, వీడియో రికార్డింగ్‌

స్మార్ట్‌ఫోన్‌లానే ఏఐ పిన్‌ సాయంతో ఫొటోలు తీయొచ్చు. వీడియోనూ రికార్డ్‌ చేయొచ్చు.

ఈ బుల్లి డివైజ్‌ను కావాలనుకుంటే కంప్యూటర్‌కు సైతం కనెక్ట్ చేయొచ్చు.

ఈ టిప్స్‌తో మొబైల్‌ బ్యాటరీ ఆదా

అదిరిపోయే లుక్‌తో మోటో ఎడ్జ్‌ 50 ప్రో

100W ఫాస్ట్‌ ఛార్జింగ్‌తో వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ 4

Eenadu.net Home