అసిస్టెంట్‌ డైరెక్టర్‌ టు హీరోయిన్‌.. 

‘వీరాంజనేయులు విహారయాత్ర’తో ఈటీవీ విన్‌లో తెలుగు ప్రేక్షకులను పలకరించింది ప్రియా వడ్లమని. 

2018లో ‘ప్రేమకు రెయిన్‌ చెక్‌’తో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన ప్రియ.. అదే ఏడాది ‘శుభలేఖలు’, ‘హుషారు’ చేసింది.

‘ఉండిపోరాదే..’ అంటూ ‘హుషారు’లోని పాట ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. 

‘ఆవిరి’, ‘కాలేజ్‌ కుమార్’, ‘ముఖచిత్రం’, ‘మను చరిత్ర’ తదితర సినిమాలతో అలరించింది. 

శ్రీవిష్ణు - శ్రీహర్ష కాంబినేషన్‌లో వచ్చిన ‘ఓం భీమ్‌ బుష్‌’లో అతిథి పాత్రలో కనిపించింది.

1997లో ఆంధ్రాలో పుట్టిన ప్రియది మహారాష్ర్ట. పాఠశాల చదువు హైదరాబాద్‌లో సాగితే, బెంగళూరులో డిగ్రీ పూర్తి చేసింది.

సినిమా ఫీల్డ్‌ అంటే ఇష్టంతో మొదట్లో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కెరీర్‌ మొదలుపెట్టింది. తర్వాతే ముఖానికి రంగేసుకుంది.

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందీ బ్యూటీ. తన ఇన్‌స్టా ఖాతాకి 3 లక్షలకు పైగానే ఫాలోవర్లు ఉన్నారు.

విభిన్నమైన స్టైల్స్‌తో, ట్రెండీ దుస్తులతో ఫొటోషూట్లు చేస్తుంటుంది. 

డ్యాన్స్‌ అంటే ఇష్టం. చిన్నప్పుడే కూచిపూడిలో శిక్షణ తీసుకుంది. ‘నన్ను రిఫ్రెష్‌ చేయాలంటే అది డ్యాన్స్‌ వల్లే సాధ్యమవుతుంది’ అంటోంది ప్రియ వడ్లమాని. 

పెయింటింగ్‌ అంటే ఈమెకు ఇష్టం. ‘మనలో ఉన్న రియాలిటీని బయటపెట్టే గొప్ప ఆర్ట్‌ ఇది’ అని చెబుతోంది.

బోర్‌ కొడితే.. బైక్‌ ఎక్కేయడమే!

సిల్క్‌ చీరలో చిలక.. తాప్సీ

ఈవారం ఓటీటీ సినిమాలు, సిరీస్‌లివే

Eenadu.net Home