జీవితం.. కప్పు కాఫీ లాంటిది!

‘ఉరుకుపటేలా’ చిత్రంతో తొలిసారి తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది ఖుష్బూ చౌదరి. 

ఈ అమ్మాయిది హైదరాబాదే. చిన్నప్పటి నుంచి నటన మీద ఇష్టంతో ఇండస్ట్రీలోకి వచ్చింది. 

సినిమాల్లో ప్రయత్నిస్తూనే హిందీలో పలు వెబ్‌సిరీస్‌ల్లోనూ నటించింది. అవి ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. 

సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. సరదాగా రీల్స్‌ చేస్తూ వాటిని ఇన్‌స్టాలో పంచుకుంటుంది. 

ఖుష్బూకు మూగజీవాలంటే చాలా ఇష్టం. ఎప్పటికప్పుడు వాటిమీద ప్రేమను తెలియజేస్తూ ఉంటుంది. అన్నట్టు తనకొక పెంపుడు పిల్లి కూడా ఉందండోయ్‌.

‘జీవితం అనేది కప్పు కాఫీ లాంటిది. మీరు ఎలా తయారు చేసుకుంటే అది అంత అద్భుతంగా ఉంటుంది’ అని చెప్తుంది ఖుష్బూ.

కాస్త ఒత్తిడిగా అనిపిస్తే గిటార్‌ ప్లే చేస్తూ రిలాక్స్‌ అవుతుందట. ఒక పనిని పూర్తి చేయడంలో కాదు.. దాన్ని చేస్తూ ఉండడంలోనే ఆనందం లభిస్తుందని అంటోంది. 

ఎక్కువగా సంప్రదాయ దుస్తులను ధరించడానికే ఇష్టపడుతుంది. చీరకట్టులోనూ మెరిసిపోతుంటుంది. 

ఈమెకు ప్రయాణాలంటే చాలా ఇష్టం. వివిధ ప్రదేశాలను చుట్టేస్తూ ఆ వీడియోలను సోషల్‌మీడియాలో పంచుకుంటుంది. 

ఇడ్లీ కోసమే మైసూర్‌ వెళ్లా!

అలా.. ఏకైక భారతీయ నటుడు రజనీకాంత్‌

ఇండియన్‌ సినిమా: రూ.1000+ కోట్లు వసూళ్ల చిత్రాలివే

Eenadu.net Home