ఫొటోలో టెక్ట్స్‌నూ ట్రాన్స్‌లేట్ చేయొచ్చు

మనకు రాని భాషను ట్రాన్స్‌లేట్‌ చేయాలంటే దాదాపు అందరూ ఆధారపడేది గూగుల్‌ ట్రాన్స్‌లేట్‌పైనే.

టెక్ట్స్‌ను గూగుల్‌ ట్రాన్స్‌లేట్‌ వేసి నచ్చిన భాషలోకి అనువదించడం సులువే. మరి ఏదైనా నేమ్‌ బోర్డును ట్రాన్స్‌లేట్‌ చేయాలంటే?

టెక్ట్స్‌ కలిగిన ఇమేజ్‌లనూ మనకు నచ్చిన భాషలో అనువదించటానికి గూగుల్‌ ట్రాన్స్‌లేట్‌లో ఓ ఫీచర్‌ ఉంది.

భాష రాని ప్రదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి సందర్శనా ప్రదేశాలు, చిరునామా బోర్డులపైన ఉండే టెక్ట్స్‌ను ఫొటో తీసి సులువుగా అనువదించవచ్చు.

మీ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ ట్రాన్స్‌లేట్ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోండి.

కెమెరా ఆప్షన్‌ను ఎంచుకోండి. ఆ పై డిటెక్ట్‌ లాంగ్వేజ్‌.. అనువదించాల్సిన లాంగ్వేజ్‌ను ఎంపిక చేసుకోండి.

మీకు కావాల్సిన ఇమేజ్‌పై క్లిక్‌ చేసి చేస్తే అందులోని టెక్ట్స్‌ను గూగుల్‌ అనువదిస్తుంది. కావాలనుకుంటే ఆ టెక్ట్స్‌ను కాపీ కూడా చేసుకోవచ్చు.

మనం వాడే స్మార్ట్‌ఫోన్‌ కెమెరా పక్కనే ఉండే గూగుల్‌ లెన్స్‌ సాయంతోనూ టెక్ట్స్‌ను అనువదించొచ్చు.

ఫోన్‌కి ఎడిక్ట్‌ అయ్యారా.. ఇలా దూరం పెట్టండి!

సైబర్‌ దొంగలకు చిక్కకుండా ఉండేందుకు ఇవి పాటించండి

షావోమీ @10.. లాంచ్‌ చేసిన కొత్త ఉత్పత్తులివే..!

Eenadu.net Home