ఐటీ రిటర్నులకు కావాల్సిన పత్రాలివే..

పాన్‌కార్డు

ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి కచ్చితంగా పాన్‌కార్డు అవసరం. మీ ఆర్థిక లావాదేవీలన్నీ దీనితోనే ముడిపడి ఉంటాయి.

Image: RKC

ఆధార్‌కార్డు

మీ ఐడెంటిటీని తెలుసుకునేందుకు ప్రభుత్వం దీన్ని ఉపయోగిస్తుంది. మీ ఆధార్‌కార్డుకు తప్పనిసరిగా ఫోన్‌ నంబర్‌ లింకై ఉండాలి. 

Image: RKC

శాలరీ స్లిప్స్‌

ఉద్యోగులైతే.. నెలవారీ జీతభత్యాలు, హెచ్‌ఆర్‌ఏ తదితర వివరాలు తెలుసుకునేందుకు ఇది అవసరమవుతుంది.

Image: RKC

ఫారం-16

ఉద్యోగి పనిచేస్తున్న సంస్థ ఫారం- 16ను జారీ చేస్తుంది. ఆర్థిక సంవత్సరంలో చెల్లించిన జీతం.. శాలరీ నుంచి మినహాయించిన టీడీఎస్‌ వివరాలు ఇందులో ఉంటాయి.

Image: RKC

ఫారం - 26ఏఎస్‌

దీన్ని ఆదాయ పన్ను శాఖ జారీ చేస్తుంది. దీంట్లో టీడీఎస్‌, అడ్వాన్స్‌ టాక్స్, రీఫండ్స్‌కు సంబంధించిన వివరాలు పొందుపరిచి ఉంటాయి. 

Image: RKC

బ్యాంకు స్టేట్‌మెంట్‌

కొన్నిసార్లు టీడీఎస్‌ చెల్లింపుల వివరాలు లభించకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో బ్యాంక్‌ స్టేట్‌మెంట్లలో ఆ వివరాలు లభిస్తాయి. బ్యాంకు ఖాతా, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ వివరాలూ సిద్ధంగా ఉంచుకోండి. రిఫండ్లు ఈ ఖాతాలోకే జమ అవుతాయి.

Image: RKC

ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రూఫ్స్‌

జీవిత బీమా, ఆరోగ్య బీమా, హోమ్‌లోన్‌, ట్యూషన్‌ ఫీజు, విరాళాలు, పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ పాస్‌బుక్, మ్యూచువల్‌ ఫండ్‌ ఖాతా స్టేట్‌మెంట్‌ లాంటి లావాదేవీలను రుజువు చేసే రసీదులను ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రూఫ్‌లుగా చూపించొచ్చు. 

Image: RKC

క్యాపిటల్‌ గెయిన్స్‌

స్టాక్‌ మార్కెట్‌/మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టి వాటిని అమ్మితే వచ్చిన లాభాలపై క్యాపిటల్‌ గెయిన్స్‌ ట్యాక్స్‌ చెల్లించాలి. నష్టపోతే సంబంధిత వివరాలు కూడా చూపించాలి. 

Image: RKC

విదేశీ ఆదాయం

విదేశాల నుంచి ఆదాయం వస్తున్నట్లయితే దానికి సంబంధించిన వివరాలను పొందుపరచాలి.

Image: RKC

పండుగ షాపింగ్‌ కోసం ఈ చిట్కాలు చూడండి..

బడ్డెట్‌ ప్లాన్‌ చేద్దామిలా!

స్కామర్ల కామన్‌ డైలాగ్స్‌ ఇవీ!

Eenadu.net Home