ఫిబ్రవరి ముఖ్యాంశాలు
- రూ.45.03 లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్‌ను ప్రతిపాదించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్. వచ్చే ఏడాది 6.8 వృద్ధిరేటు సాధ్యమవుతుందని అంచనా. ఈ బడ్జెట్‌ను సప్తపథంగా అభివర్ణన.
#Eenadu
- కొత్త పన్ను విధానంతో వేతన జీవులకు ఊరట. రూ.7లక్షల వరకు పన్ను మినహాయింపు.
#Eenadu
- ప్రముఖ వ్యాపారవేత్త, ప్రపంచ కుబేరుడు అదానీ ఆస్తుల్లో అక్రమాలున్నాయని హిండెన్‌బర్గ్ నివేదిక ప్రకటన. పార్లమెంట్ సమావేశాల్లో జేపీసీ వేయాలని ప్రతిపక్షాల ఆందోళన. లక్షల కోట్ల సంపద ఆవిరి. కుబేరుల జాబితాలో 3వ స్థానం నుంచి 30కి పడిపోయిన అదానీ.
#Eenadu
- సిరియా, తుర్కియేలలో భారీ భూకంపం. 50వేల మందికిపైగా మృతి. నిరాశ్రయులైన లక్షల మంది ప్రజలు.
#Eenadu
- బీబీసీపై ఐటీ దాడులు, సర్వే తీరుపై ఆందోళన.
#Eenadu
- అధిక పింఛను పొందేందుకు అవకాశం కల్పించిన ఈపీఎఫ్‌ఓ. వేతన జీవికి అనుకూలమైన నిర్ణయం.
#Eenadu
- కుక్కల కట్టడికి బెంగళూరు, గోవా పట్టణాల్లో అనుసరించిన సీఎన్‌వీఆర్ పద్ధతిని అమలు చేయనున్న జీహెచ్‌ఎంసీ. కుక్కలను పట్టుకొని రేబీస్ వ్యాక్సిన్ వేయడంతో పాటు సంతాన నియంత్రణ శస్త్రచికిత్స చేసి ఐదు రోజుల తర్వాత వదిలేస్తారు.
#Eenadu
- ఈ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది. ఎల్‌నినో ప్రభావంతో ఏప్రిల్ 15 నుంచి జూన్ మొదటి వారం వరకు సాధారణం కంటే 2 డిగ్రీల ఉష్ణోగ్రత అధికంగా ఉంటుందని వాతావరణ సంస్థ పేర్కొంది.
#Eenadu
- అమెరికా వెళ్లాలనుకున్న యువతకు మంచి అవకాశాన్ని ఆ దేశం కల్పించింది. కోర్సు ప్రారంభానికి ఏడాది ముందే I-20 దరఖాస్తులను ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంది.
#Eenadu
- దివంగత మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు ఎన్టీఆర్‌కు మరో అరుదైన గుర్తింపు. ఆయన చిత్రంతో వంద రూపాయల వెండి నాణెం విడుదలకు ఆర్‌బీఐ ఆమోదం.
#Eenadu