ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓ.. కీ పాయింట్స్
మదుపరులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పబ్లిక్ ఇష్యూల్లో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఒకటి. ఈ సంస్థ త్వరలో ఐపీఓకు రాబోతోంది.
మహారత్న హోదా కలిగిన ప్రభుత్వరంగ సంస్థ ఎన్టీపీసీ యాజమాన్యంలోని ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ సంస్థ.. ఐపీఓ ద్వారా రూ.10వేల కోట్ల నిధుల్ని సమీకరించనుంది.
ఈ పబ్లిక్ ఇష్యూ సబ్‌స్క్రిప్షన్ నవంబర్ 19న ప్రారంభమై.. 22న ముగుస్తుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు నవంబర్ 18నే బిడ్డింగ్ విండో తెరుచుకోనుంది.
ఐపీఓ ధరల శ్రేణిని రూ.102- రూ.108గా కంపెనీ నిర్ణయించింది. 138 షేర్లను ఒక లాట్‌గా నిర్ణయించారు. రిటైల్ మదుపర్లు ఒక్కో లాట్ కొనుగోలుకు రూ.14,904 వెచ్చించాల్సి ఉంటుంది.
ఐపీఓ కోసం పూర్తిగా తాజా షేర్లను జారీ చేయనున్నారు. మొత్తం షేర్లలో 75% క్యూఐబీలకు, 15% ఎన్‌ఐఐలకు, 10% రిటైల్ ఇన్వెస్టర్లకు రిజర్వ్ చేశారు.
ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ షేర్లు నవంబర్ 25న అలాట్ కానున్నాయి. నవంబర్ 27న కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ కానుంది.
ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను రుణాల తిరిగి చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు కంపెనీ వినియోగించనుంది.
ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఆదాయం 2022లో రూ.910 కోట్ల నుంచి రూ.1962.6 కోట్లకు పెరిగింది. లాభం రూ.94.74 కోట్ల నుంచి రూ.344.72 కోట్లకు వృద్ధి చెందింది.
హ్యుందాయ్ మోటార్ ఇండియా, స్విగ్గీ తర్వాత ఈ ఏడాదిలో రానున్న మూడో అతి పెద్ద ఐపీఓ ఇదే కావడం గమనార్హం.