వర్షాకాలంలో ఇమ్యూనిటీని కూడగడదాం..
వానాకాలం వచ్చిందంటే వయసుతో సంబంధం లేకుండా జలుబు, దగ్గు, జ్వరం వంటి అనారోగ్య సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. వాటన్నింటినీ తట్టుకోవాలంటే మనలో రోగనిరోధక శక్తి ఉండాలి. అది కావాలంటే.. ఆహార, జీవన శైలిలో మార్పులు చేసుకోవాలి.
image: rkc
నిమ్మజాతి పండ్లు..
విటమిన్ సి అనగానే గుర్తొచ్చేవి ఇవే. కాలానికి తగ్గట్లు నారింజ, బత్తాయి వంటి పండ్లు లభిస్తుంటాయి. వీటిని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
image: unsplash
బ్రకోలి...
విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాల్లో బ్రకోలి ఒకటి. ఇందులో సల్ఫర్ కూడా ఎక్కువే. దీన్ని తరచూ తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
image: unsplash
గుడ్డు..
ఇందులో విటమిన్ డి, ప్రోటీన్లు, కాల్షియం అధికంగా ఉంటాయి. రోజూ ఒక గుడ్డు తింటే మంచిదని ఆహార నిపుణులు చెబుతుంటారు. ఇది శ్వాసకోశ వ్యాధులను తట్టుకునే శక్తినిస్తుంది.
image: unsplash
వెల్లుల్లి..
జలుబు, జ్వరం, గొంతు ఇన్ఫెక్షన్లను వెల్లుల్లి అదుపు చేస్తుంది. దీన్నితరచూ కూరల్లో వాడడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇందులో విటమిన్ బి1, బి2, బి3, బి6, ఇతర ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.
image: unsplash
డ్రై ఫ్రూట్స్..
బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్, పిస్తా వంటి వాటిల్లో విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. జబ్బులతో పోరాడేందుకు శరీరానికి ఇది శక్తినిస్తుంది. సాయంత్రం స్నాక్స్‌కి బదులుగా ఇవి తీసుకోవచ్చు.
image: rkc
ఆకుకూరలు..
ఆకుకూరల్లో విటమిన్ ఎ, సి, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటితో ఇమ్యూనిటీ పెరగడమే కాదు, చర్మం, జుట్టు సమస్యలు కూడా పరిష్కారమవుతాయి.
image: unsplash
గోరువెచ్చని నీళ్లు..
శరీరం డీ హైడ్రేట్ కాకుండా జాగ్రత్తగా ఉండాలి. రోజుకి 7 నుంచి 8 గ్లాసుల నీళ్లు తాగాలి. అవి కూడా గోరువెచ్చని నీళ్లే తాగాలి. అప్పుడే గొంతులో ఉన్న కఫం, బ్యాక్టీరియా
నుంచి ఉపశమనం లభిస్తుంది.
image: pixabay
వ్యాయామం..
ఎలాంటి ఆహారం తీసుకున్నా శరీరానికి తగిన వ్యాయామం అందించాలి. అప్పుడే అనారోగ్యం వచ్చినా తట్టుకునే శక్తి ఉంటుంది. అలాగే శరీరం ఫిట్‌గానూ అవుతుంది.
image: pixabay
మంచి నిద్ర..
శరీరానికి మంచి నిద్ర అవసరం. మనిషి రోజుకి సగటున 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. నిద్రలేమితో శరీరం బలహీనపడుతుంది. రోగనిరోధక శక్తి తగ్గుతుంది. దీంతో అనారోగ్య సమస్యలు వచ్చిపడతాయి.
image: rkc