ఒకే మ్యాచ్‌లో రోహిత్ 7 రికార్డులు
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య సూపర్-8 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవడమే కాకుండా కెప్టెన్ రోహిత్ శర్మ ఏకంగా 7 రికార్డులు సృష్టించాడు. అవేంటంటే..
అంతర్జాతీయ టీ20ల్లో 200 సిక్స్‌లు బాదిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు
టీ20 ప్రపంచకప్-2024లో ఫాస్టెస్ట్(19 బంతుల్లో) హాఫ్ సెంచరీ నమోదు చేశాడు
ఈ టోర్నీలో కెప్టెన్‌గా ఫాస్టెస్ట్(19 బంతుల్లో) హాఫ్ సెంచరీ కూడా రోహిత్‌దే.
అంతర్జాతీయ టీ20ల్లో ఆస్ట్రేలియాపై ఫాస్టెస్ట్(19 బంతుల్లో) హాఫ్ సెంచరీ సాధించిన ఘనత హిట్‌మ్యాన్‌దే..
రోహిత్ అర్ధశతకం అందుకున్నప్పుడు జట్టు పరుగులు 52. ఓ ఆటగాడు అర్ధసెంచరీ చేసిన సమయంలో ఓ జట్టు చేసిన అత్యల్ప స్కోర్ ఇదే.
అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగుల (4,165) రికార్డు రోహిత్ శర్మ పేరు మీదే ఉంది.
టీ20ల్లో ఒక మ్యాచ్‌లో కెప్టెన్‌గా అత్యధిక సిక్స్‌లు(8) బాదింది కూడా రోహిత్ శర్మనే.
ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 92 పరుగులు చేయగా.. అంతర్జాతీయ క్రికెట్‌లో 19వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు.