ఉప్పల్‌ స్టేడియంలో భారత్‌ ఎన్ని మ్యాచ్‌లు గెలిచిందంటే?

మూడేళ్ల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్‌కు అతిథ్యం ఇవ్వబోతోంది ఉప్పల్‌ స్టేడియం. ఆదివారం భారత్, ఆసీస్‌ మధ్య మూడో టీ20 జరగనున్న విషయం తెలిసిందే.

Image:Eenadu

 ఈ స్టేడియం నిర్మాణ పనులు 2003లో ప్రారంభమయ్యాయి. దీని సిటింగ్ కెపాసిటీ 55,000. 2005లో నిర్మాణం పూర్తి చేసుకుంది.

Image:Eenadu 

తొలుత దీని పేరు విశాఖ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంగా ఉండేది.

Image:Eenadu  

అప్పటి ముఖ్యమంత్రి వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి హయాంలో (2005లో) ‘రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ క్రికెట్ స్టేడియం’గా పేరు మార్చారు.

Image:Eenadu 

ఈ మైదానంలో తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ (వన్డే) 2005 నవంబర్‌ 16న భారత్, సౌతాఫ్రికా మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో యువరాజ్‌ సింగ్‌ (103; 122 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఆకట్టుకున్నా భారత్‌ ఓటమిని చవిచూసింది.

Image:Twitter

ఉప్పల్‌ స్టేడియం ఇప్పటివరకు రెండు అంతర్జాతీయ టీ20లకు అతిథ్యమిచ్చింది. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ గెలుపొందింది. మరో టీ20 (ఆస్ట్రేలియాతో) వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండా తుడిచిపెట్టుకుపోయింది.

Image:Eenadu

వెస్టిండీస్‌తో 2019 డిసెంబరు 6న జరిగిన టీ20లో భారత్‌ 6 వికెట్ల తేడాతో గెలిచింది. విరాట్‌ కోహ్లీ (94; 50 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లు) వీర విహారం చేసి టీమ్‌ఇండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇక్కడ జరిగిన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ ఇదే.

Image:Twitter

ఇక్కడ భారత్ ఆరు వన్డేలు ఆడి మూడు విజయాలు, మూడు ఓటములను ఖాతాలో వేసుకుంది. ఐదు టెస్టులు ఆడి 4 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఒక మ్యాచ్‌ డ్రా అయింది.

Image:Twitter

రోహిత్‌ @ 250.. 200 క్లబ్‌లో ఇంకెవరు?

ఐపీఎల్‌లో జట్ల అత్యల్ప స్కోర్స్‌ ఇవీ!

ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ సెంచరీలివీ!

Eenadu.net Home