భారత్ - పాక్‌ మ్యాచ్ రికార్డులివే..

టీ20 ప్రపంచ కప్‌లో భారత్‌ మరో విజయాన్ని నమోదు చేసింది. పాకిస్థాన్‌ను చిత్తు చేసింది.

పొట్టి కప్‌ చరిత్రలో పాక్‌పై టీమ్‌ఇండియా ఆధిపత్యం 7-1కి చేరింది.

టీ20 వరల్డ్‌ కప్‌లో ఒక జట్టుపై అత్యధిక విజయాలు సాధించిన తొలి టీమ్‌ భారత్‌. పాక్‌పై 7 మ్యాచుల్లో గెలిచింది.

ఈ మ్యాచ్‌లో బుమ్రా 3 వికెట్లు తీశాడు. అతడినే ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు వరించింది. గతేడాది వన్డే ప్రపంచ కప్‌లోనూ బుమ్రాకే ఈ అవార్డు దక్కింది.

టీ20ల్లో పాక్‌పై తక్కువ స్కోరును కట్టడి చేసి గెలిచిన రెండో టీమ్‌ భారత్. గతంలో (2021) జింబాబ్వే 119 పరుగుల టార్గెట్‌ను కాపాడుకుంది. ఇప్పుడు 120 రన్స్‌ను కొట్టడంలో పాక్‌ విఫలమైంది.

This browser does not support the video element.

ఓవరాల్‌ ప్రపంచ కప్‌ల్లోనే తక్కువ లక్ష్యాన్ని కాపాడుకున్న రెండో మ్యాచ్‌ కూడా ఇదే. గతంలో (2014) కివీస్‌పై శ్రీలంక 120 పరుగుల టార్గెట్‌ను ఉంచి విజయం సాధించింది.

అత్యల్ప స్కోరును కాపాడుకొని విజయం సాధించడం భారత్‌కిదే తొలిసారి. జింబాబ్వేపై 2016లో 139 పరుగులను ఉంచి విజయం సాధించింది.

భారత్‌ చేతిలో తమ జట్టు ఓడిపోవడంతో పాక్‌ పేసర్ నసీమ్ షా భావోద్వేగానికి గురయ్యాడు. బౌలింగ్‌లో (3/21), బ్యాటింగ్‌లో (4 బంతుల్లో 10 పరుగులు) రాణించినా పాక్‌ పరాజయం కావడంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. సహచరుడు అఫ్రిది ఓదార్చాడు. భారత కెప్టెన్ రోహిత్ కూడా బాధపడొద్దని సూచించాడు.

టెస్టు క్రికెట్‌లో ఇంగ్లాండ్ ప్రపంచ రికార్డు

టీ20ల్లో అత్యధిక విజయాలు సాధించిన జట్లు (10-07-2024)

ముంబయి తీరంలో టీమిండియా సంబరాలు..

Eenadu.net Home