భారత టాప్ స్కోరర్ @ 2023
శుభ్‌మన్ గిల్ (208)
శుభ్‌మన్ ఈ ఏడాది ఆరంభం నుంచి 20 ఇన్నింగ్స్‌ల్లో 1,230 పరుగులు చేశాడు. డబుల్ సెంచరీ (208 రన్స్) సాధించాడు. అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన బ్యాటర్ గిల్.
విరాట్ కోహ్లీ (166*)
విరాట్ కోహ్లీ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 15 ఇన్నింగ్స్‌ల్లో 752 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, నాలుగు అర్ధశతకాలు ఉన్నాయి. అత్యధికంగా 166 పరుగులు చేశాడు. శ్రీలంకపై సాధించాడు.
రోహిత్ శర్మ (131)
భారత కెప్టెన్ రోహిత్ శర్మ అర్ధశతకాలు సాధించినా.. సెంచరీలుగా మలచలేకపోయాడు. ఈ ఏడాది ఇప్పటి వరకు కేవలం రెండు శతకాలే. న్యూజిలాండ్‌పై 101 పరుగులు చేశాడు. ఇప్పుడు ప్రపంచకప్‌లో అఫ్గాన్‌పై 131 రన్స్ సాధించాడు. ఇప్పటి వరకు 17 ఇన్నింగ్స్‌ల్లో 789 పరుగులు చేశాడు.
కేఎల్ రాహుల్ (111)
గాయం నుంచి కోలుకుని వచ్చాక కేఎల్ రాహుల్ అదరగొట్టేస్తున్నాడు. ఇటీవల ముగిసిన ఆసియా కప్‌లో పాక్‌పై 111 పరుగులు సాధించాడు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 13 ఇన్నింగ్స్‌ల్లో 628 పరుగులు చేశాడు. ఇందులో సెంచరీతోపాటు ఐదు అర్ధశతకాలు ఉన్నాయి.
శ్రేయస్ అయ్యర్ (105)
వరుసగా హాఫ్ సెంచరీలు సాధించిన శ్రేయస్ గాయపడటంతో ఆటకు దూరమయ్యాడు. ఇప్పుడు మళ్లీ వచ్చాక మునుపటి ఫామ్‌తో ఆడేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ ఏడాది అతడు 9 ఇన్నింగ్స్‌ల్లో 289 పరుగులు చేశాడు. ఆసీస్‌పై 105 పరుగులు సాధించాడు.
హార్దిక్ పాండ్య (87)
స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య ఈ ఏడాది ఇప్పటి వరకు 13 ఇన్నింగ్స్‌ల్లో మొత్తం 383 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్ధశతకాలు కాగా, అత్యధికంగా 87 పరుగులు చేశాడు. ఆసియా కప్‌లో పాక్‌పైనే మిడిలార్డర్‌లో కావడం విశేషం. బౌలింగ్‌లోనూ 17 వికెట్లు పడగొట్టాడు.
ఇషాన్ కిషన్ (82)
యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ గతేడాది డబుల్ సెంచరీ సాధించాడు. అయితే, ఈ ఏడాది మాత్రం సెంచరీ నమోదు చేయలేకపోయాడు. అత్యధికంగా పాక్‌పై ఆసియా కప్ మ్యాచ్‌లో 82 పరుగులు చేశాడు. ఈ ఏడాది ఇప్పటి వరకు 15 ఇన్నింగ్స్‌ల్లో 456 పరుగులు చేశాడు.
సూర్యకుమార్ యాదవ్ (72)
ఈ ఏడాది తొలి అర్ధభాగంలో సూర్యకుమార్‌కు కలిసిరాలేదు. ఆసియా కప్ నుంచి మాత్రం అదరగొట్టేశాడు. ఇప్పటి వరకు 13 ఇన్నింగ్స్‌ల్లో 283 పరుగులు చేశాడు. అత్యధికంగా ఆస్ట్రేలియాపై 72 పరుగులు బాదేశాడు. కేవలం 37 బంతుల్లోనే చేయడం విశేషం.