కామన్వెల్త్‌లో భారత్‌ ప్రస్థానం!

లండన్‌ - 1934 


ఈ క్రీడలు 1930లో ప్రారంభమైనా.. 1934లో జరిగిన పోటీల్లో భారత్‌ పాల్గొని 1 కాంస్య పతకం (పురుషుల 74 కిలోల రెజ్లింగ్‌) గెలిచింది.

Image: RKC

సిడ్నీ - 1938 


భారత్‌ పాల్గొన్నా ఒక పతకం కూడా సాధించలేకపోయింది.

Image: RKC

రెండో ప్రపంచయుద్ధం కారణంగా 1942,1946 కామన్వెల్త్ క్రీడలు జరగలేదు. 1950లో తిరిగి ప్రారంభమైనా భారత్‌ పాల్గొనలేదు. అనివార్య కారణాల వల్ల 1962, 1986 క్రీడల్లోనూ పోటీ చేయలేదు.

Image: RKC

కెనడా - 1954


భారత్‌ పతకాలేవీ నెగ్గలేదు.

Image: RKC

వేల్స్‌ - 1958


రెండు బంగారు పతకాలు(అథ్లెటిక్స్‌, రెజ్లింగ్‌), ఒక రజత పతకం (రెజ్లింగ్‌) సాధించింది. మొత్తం 3 పతకాలు భారత్‌ ఖాతాలో పడ్డాయి.

Image: RKC

జమైకా - 1966


భారత్‌ 10 పతకాలు సాధించింది.. వాటిలో 3 బంగారు, 4 రజత, 3 కాంస్య పతకాలున్నాయి.

Image: RKC

ఎడెన్‌బర్గ్‌ - 1970


మొత్తం 12 (5 బంగారం, 3 రజతం, 4 కాంస్యం) పతకాలు గెలిచింది.

Image: RKC

క్రిస్ట్‌చర్చ్‌ - 1974


భారత్‌ 15 పతకాలు కైవసం చేసుకుంది. వాటిలో 4 స్వర్ణం, 8 రజతం, 3 కాంస్య పతకాలున్నాయి.

Image: RKC

ఎడ్మంటన్‌ - 1978


ఇక్కడ కూడా భారత్‌ 15 (5 స్వర్ణం, 5 రజతం, 5 కాంస్యం) పతకాలు గెలుచుకుంది.

Image: RKC

బ్రిస్బేన్‌ - 1982


ఈసారి భారత్‌ 16 పతకాలు అందుకుంది. వాటిలో 5 బంగారు, 8 రజత, 3 కాంస్య పతకాలున్నాయి.

Image: RKC

ఆక్లాండ్‌ - 1990


మొత్తం 32 పతకాలు (13 స్వర్ణం, 8 రజతం, 11 కాంస్యం) భారత్‌ తన ఖాతాలో వేసుకుంది.

Image: RKC

విక్టోరియా - 1994


భారత్‌ ఖాతాలో 24 పతకాలు. వాటిలో 6 బంగారు, 11 రజతం, 7 కాంస్య పతకాలున్నాయి.

Image: RKC

కౌలాలంపూర్ - 1998


7 స్వర్ణం, 10 రజతం, 8 కాంస్యం.. మొత్తం 25 పతకాలు భారత్‌ గెలుచుకుంది.

Image: RKC

మాంచెస్టర్‌ - 2002


తొలిసారిగా భారత్‌ 50కిపైగా పతకాలు గెలిచింది. 30 స్వర్ణం, 22 రజతం, 17 కాంస్యం. మొత్తంగా 69 పతకాలు గెలిచి.. పతకాల పట్టికలో 4వ స్థానంలో నిలిచింది.

Image: Twitter

మెల్‌బోర్న్‌ - 2006


మొత్తం 50 పతకాలు. వాటిలో 22 స్వర్ణం, 17 రజతం, 11 కాంస్య పతకాలున్నాయి.

Image: Twitter

న్యూ దిల్లీ - 2010


తొలిసారి కామన్వెల్త్‌ గేమ్స్‌ భారత్‌లో జరిగాయి. ఈ సారి భారత్‌ పతకాల సంఖ్య వంద దాటింది. మొత్తం 101 (38 స్వర్ణం, 27 రజతం, 36 కాంస్యం) పతకాలు గెలిచింది.

Image: Twitter

గ్లాస్గో - 2014


మొత్తంగా 64 పతకాలే సాధించింది. వాటిలో 15 బంగారు, 30 రజత, 19 కాంస్య పతకాలున్నాయి.

Image: Twitter

గోల్డ్‌కోస్ట్‌ - 2018


26 స్వర్ణం, 20 రజతం, 20 కాంస్యం మొత్తం.. 66 పతకాలను గెలుచుకుంది.

Image: Twitter

బర్మింగ్‌హామ్‌ - 2022


మొత్తం 61 పతకాలు గెలుచుకుంది. వాటిలో 22 స్వర్ణం, 16 రజతం, 23 కాంస్య పతకాలున్నాయి. పతకాల పట్టికలో భారత్‌ 4వ స్థానంలో నిలిచింది.

Image: AP

సిక్సుల మోత.. హైదరాబాద్‌ మ్యాచే టాప్‌

ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక స్కోర్స్‌ ఇవీ!

అందాల షెఫాలీ బగ్గా..

Eenadu.net Home