పారిస్ ఒలింపిక్స్‌లో భారత పతక వీరులు
మన అథ్లెట్లు మొదటిసారి ఒలింపిక్స్‌లో రెండంకెల పతకాలు దాటుతారని భావించాం. కనీసం టోక్యో (7 పతకాలు) ప్రదర్శననైనా అధిగమిస్తారనుకున్నాం.
కానీ, కాస్త నిరాశైతే తప్పలేదు. కిందటిసారి కన్నా ఒక్కటి తక్కువగా.. పారిస్ ఒలింపిక్స్‌లో అరడజను (5 కాంస్యాలు, ఒక రజతం) పతకాలతోనే భారత్ సరిపెట్టుకుంది. ఈసారి విశ్వక్రీడల్లో పతకాలు సాధించిన భారత అథ్లెట్లు వీరే..
మను బాకర్
సాధించిన పతకం: కాంస్యం
విభాగం: షూటింగ్ మహిళల సింగిల్స్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్
మనుబాకర్, సరబ్‌జ్యోత్ సింగ్
సాధించిన పతకం: కాంస్యం
విభాగం: షూటింగ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్
స్వప్నిల్ కుశాలె
సాధించిన పతకం: కాంస్యం
విభాగం: షూటింగ్ 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్
పురుషుల హాకీ జట్టు
సాధించిన పతకం: కాంస్యం
నీరజ్ చోప్రా
సాధించిన పతకం: రజతం
విభాగం: పురుషుల జావెలిన్ త్రో
అమన్ సెహ్రావత్
సాధించిన పతకం: కాంస్యం
విభాగం: రెజ్లింగ్ పురుషుల 57 కేజీల ఫ్రీస్టైల్