‘కంగారు’లతో పోరు.. చూద్దాం గత రికార్డులు

టీ20 ప్రపంచకప్‌ కోసం సన్నద్ధతలో భాగంగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లతో టీ20 సిరీస్‌లను ఆడేందుకు టీమ్‌ఇండియా సిద్ధమైంది. సెప్టెంబర్ 20 (మంగళవారం) నుంచి ఆసీస్‌తో మూడు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది.

Image:Twitter

ఇప్పటివరకు భారత్‌, ఆసీస్‌ మధ్య 23 టీ20లు జరిగాయి. ఇందులో టీమ్‌ఇండియా 13 మ్యాచ్‌ల్లో గెలుపొందగా.. కంగారుల జట్టు తొమ్మిది మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.

Image:RKC

ఇరుజట్ల మధ్య తొలి టీ20 డర్బన్‌ వేదికగా 2007 సెప్టెంబరు 22న జరిగింది. దీంట్లో టీమ్‌ఇండియా 15 పరుగుల తేడాతో నెగ్గింది. యువరాజ్‌ సింగ్‌ 30 బంతుల్లోనే 70 పరుగులు చేసి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు.

Image:RKC

ఈ రెండు జట్ల మధ్య జరిగిన చివరి 5 టీ20ల్లో ఆసీస్‌ మూడు మ్యాచ్‌ల్లో గెలుపొందగా.. భారత్‌ రెండింటిలో నెగ్గింది. 2020 డిసెంబరు 8న చివరి టీ20 జరగ్గా ఇందులో ఆస్ట్రేలియా గెలిచింది.

Image:RKC

టీ20ల్లో ఆసీస్‌పై భారత్‌ తరఫున అత్యధిక పరుగులు చేసిన రికార్డు విరాట్‌ కోహ్లీ (718 పరుగులు) పేరిట ఉంది.

Image:RKC

భారత్‌పై ఆస్ట్రేలియా తరఫున అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఆరోన్‌ ఫించ్‌ (440 పరుగులు) పేరిట ఉంది.

Image:Twitter

భారత్‌ అత్యధిక స్కోరు 202/4 కాగా.. అత్యల్ప స్కోరు 74. ఆసీస్‌ అత్యధిక స్కోరు 201/7. అత్యల్ప స్కోరు 86.

Image:Twitter

భారత్‌ నుంచి అత్యధికంగా జస్ప్రీత్‌ బుమ్రా 15 వికెట్లు పడగొట్టగా.. ఆసీస్‌ తరఫున షేన్‌ వాట్సన్‌ 10 వికెట్లు తీశాడు.

Image:Twitter

టీమ్‌ఇండియా తరఫున అత్యుత్తమ బౌలింగ్‌ ప్రదర్శన రవిచంద్రన్ అశ్విన్‌ (4/11) ఉండగా.. ఆసీస్‌ నుంచి బెరండ్రాఫ్ (4/21) ఉన్నాడు.

Image:Twitter

రోహిత్‌ @ 250.. 200 క్లబ్‌లో ఇంకెవరు?

ఐపీఎల్‌లో జట్ల అత్యల్ప స్కోర్స్‌ ఇవీ!

ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ సెంచరీలివీ!

Eenadu.net Home