భారత్‌ వర్సెస్‌ బంగ్లాదేశ్‌.. ఎవరిది పైచేయి? 

టీ20 ప్రపంచకప్‌లో వరసగా రెండు మ్యాచ్‌ల్లో నెగ్గి ఊపుమీద కనిపించిన భారత్‌.. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో మ్యాచ్‌లో ఓటమిపాలై చతికిలపడింది. దీంతో తన సెమీస్‌ అవకాశాలను మెరుగుపర్చుకోవాలంటే తర్వాతి మ్యాచ్‌లు గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Image:RKC 

ఇలాంటి తరుణంలో టీమ్‌ఇండియా.. బుధవారం బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఈ రెండు జట్లు సెమీస్‌లో చోటు కోసం పోటీపడుతున్నాయి. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, ఒక ఓటమితో పాయింట్ల పట్టికలో భారత్‌ రెండో స్థానంలో ఉండగా.. బంగ్లా కూడా మూడింట.. రెండు విజయాలతో మూడో స్థానంలో ఉంది.

Image:RKC

మరి ఇప్పటివరకు జరిగిన టీ20 ప్రపంచకప్‌ల్లో ఈ ఇరు జట్లు ఎప్పుడెప్పుడు తలపడ్డాయి, ఏ మ్యాచ్‌లో ఏ జట్టు విజయం సాధించిందో ఓ సారి తెలుసుకుందాం.

Image:RKC

టీ20 ప్రపంచకప్‌లో భారత్‌, బంగ్లాదేశ్ మధ్య మూడు మ్యాచ్‌లు జరిగాయి. ఈ మూడింటిలోనూ టీమ్‌ఇండియానే విజయం సాధించింది.

Image:RKC

ఈ ఇరు జట్లు తొలిసారిగా 2009 పొట్టి ప్రపంచకప్‌లో తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్.. 180/5 స్కోరు చేయగా.. లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్‌ 8 వికెట్లు కోల్పోయి 155 పరుగులే చేయగలిగింది. దీంతో భారత జట్టు 25 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Image:RKC

2010, 2012 టీ20 ప్రపంచకప్‌ల్లో టీమ్ఇండియా, బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్‌లు జరగలేదు. 2014 టీ20 ప్రపంచకప్‌లో జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో 138/7 స్కోరు చేసింది.

Image:RKC

139 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌.. రోహిత్‌ శర్మ (56), విరాట్‌ కోహ్లీ (57) అర్ధ శతకాలతో రాణించడంతో 18.3 ఓవర్లలోనే ఛేదించింది.

Image:RKC

భారత్‌లో జరిగిన 2016 టీ20 ప్రపంచకప్‌ సెమీఫైనల్‌లో టీమ్‌ఇండియా, బంగ్లాదేశ్‌ చివరిసారిగా తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా నిర్ణీత ఓవర్లలో 146/7 స్కోరు చేసింది.

Image:RKC

బంగ్లాదేశ్ విజయానికి చివరి ఓవర్‌లో 11 పరుగులు అవసరం కాగా.. తొలి మూడు బంతుల్లోనే 9 పరుగులు రావడంతో మ్యాచ్‌ ఉత్కంఠభరింతంగా మారింది. కానీ, అనూహ్యంగా ఆఖరి మూడు బంతులకూ వికెట్లు దక్కడంతో భారత్‌ ఒక్క పరుగు తేడాతో గట్టెక్కింది.

Image:RKC

IPL: ఈసారి వీళ్లే టాక్‌ ఆఫ్‌ ది ఆక్షన్‌

IPL వేలం: 2022లో ₹ 551.7 కోట్లు... మరిప్పుడు ఎంత?

IPL వేలం: గతేడాది స్టార్క్‌.. అంతకుముందు ఎవరంటే?

Eenadu.net Home