ఇంగ్లాండ్‌తో తొలి టీ20..

నమోదైన రికార్డులివే

ఇంగ్లాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ అన్ని విభాగాల్లో మెరుగైన ప్రదర్శన చేసింది. 

తొలుత ఇంగ్లండ్‌ను 132 పరుగులకే ఆలౌట్ చేసిన భారత్.. టార్గెట్‌ని 12.5 ఓవర్లలోనే అందుకుంది. ఈ క్రమంలోనే భారత ఆటగాళ్లు వివిధ రికార్డులు నెలకొల్పారు.

ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ (79; 34 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌లు) దంచికొట్టాడు. అతను 20 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

దీంతో అభిషేక్ టీ20ల్లో ఇంగ్లాండ్‌పై భారత్‌ తరఫున సెకండ్ ఫాస్టెస్ట్ హాఫ్‌ సెంచరీ చేసిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. యువరాజ్‌ (12 బంతులు) అభిషేక్ కంటే ముందున్నాడు.

ఈ మెరుపు ఇన్నింగ్స్‌లో అభిషేక్ 8 సిక్స్‌లు బాదేసి టీ20ల్లో ఛేజింగ్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన భారత బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. 

పేసర్ అర్ష్‌దీప్ సింగ్ రెండు వికెట్లు పడగొట్టి టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు (97) తీసిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. చాహల్ (96)ను అధిగమించాడు.

ఇంగ్లండ్‌తో తొలి టీ20లో హార్దిక్ పాండ్య రెండు వికెట్లు సాధించాడు. దీంతో టీ20ల్లో అర్ష్‌దీప్, చాహల్ తర్వాత ఎక్కువ వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా హార్దిక్ నిలిచాడు.

హార్దిక్ (91 వికెట్లు) మూడో స్థానంలో ఉండగా.. భువనేశ్వర్ కుమార్ (90), బుమ్రా (89) తర్వాత ఉన్నారు.

CT 2025: ఏ ఏడాది ఎవరు విన్నర్‌?

IND vs ENG: నమోదైన రికార్డులివే!

వన్డేల్లో అత్యధిక రన్స్‌.. టాప్‌-10లోకి రోహిత్‌

Eenadu.net Home