విశాఖ టెస్టు రికార్డులు.. బుమ్రాకే ఎక్కువ!

3

బజ్‌బాల్‌ గేమ్‌ ఆడడం ప్రారంభించాక (మెక్‌కల్లమ్‌ కోచ్‌ అయ్యాక) నాలుగో ఇన్నింగ్స్‌ ఛేజ్‌లో ఇంగ్లాండ్‌ మూడోసారి ఓటమి పాలైంది. అయితే 8 మ్యాచుల్లో గెలుపొందడం గమనార్హం.

292

భారత్‌లో భారత్‌ మీద నాలుగో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ సాధించిన పరుగులు. అత్యధిక నాలుగో ఇన్నింగ్స్‌ పరుగుల జాబితాలో ఇది రెండో స్థానంలో ఉంది.

97

ఇంగ్లాండ్‌పై ఇప్పటి వరకు రవిచంద్రన్‌ అశ్విన్‌ పడగొట్టిన వికెట్లు. బీఎస్‌ చంద్రశేఖర్‌ (95) రికార్డును అశ్విన్‌ దాటేశాడు.

10.11

రెండో టెస్టులో జస్‌ప్రీత్‌ బుమ్రా బౌలింగ్ సగటు ఇది. ఉత్తమ సగటు జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు.

4

సిరీస్‌లో భారత్‌ తొలి మ్యాచులో ఓడి మరుసటి మ్యాచ్‌లో పుంజుకున్న సందర్భాల సంఖ్య. దక్షిణాఫ్రికా (2010), ఆస్ట్రేలియా (2017), ఇంగ్లాండ్‌ (2021)పై గతంలో ఇలానే చేశారు.

భారత్‌లో ఒక టెస్టులో 9 వికెట్లు తీసిన రెండో పేసర్‌ బుమ్రా. గతంలో 78 పరుగులు ఇచ్చిన ఇషాంత్‌ శర్మ 9 వికెట్లు పడగొట్టాడు.

1196

విశాఖపట్నం టెస్టులో నమోదైన మొత్తం పరుగులు. టెస్టు చరిత్రలో మూడో అత్యధిక పరుగులు ఇవి. 1225 (ఇంగ్లాండ్‌ - ఆస్ట్రేలియా), 1215 (శ్రీలంక - ఇంగ్లాండ్‌) తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.

బుమ్రా ఓ టెస్టులో వందలోపు పరుగులు ఇచ్చి ఎనిమిది అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన సందర్భాలు. భారత బౌలర్ల జాబితాతో అశ్విన్‌ (7) తొలి స్థానంలో ఉన్నాడు.

1996

25 ఏళ్లలోపు వయసున్న ఇద్దరు బ్యాటర్లు సెంచరీలు కొట్టిన సంవత్సరం ఇది. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు జైస్వాల్‌ - గిల్‌ సెంచరీలు చేశారు. 1996లో గంగూలీ - సచిన్‌ శతకాలు సాధించారు.

టీ20ల్లో వేగవంతమైన సెంచరీ.. భారత బ్యాటర్లు వీరే!

ఆ ‘పింక్‌’ మ్యాచ్‌లో ఏమైంది?

ఐపీఎల్ వేలం.. ఖరీదైన అన్‌క్యాప్‌డ్ ప్లేయర్స్‌

Eenadu.net Home