భారత్ Vs ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌.. ఆసక్తికర విశేషాలు

ఈ సిరీస్‌లో భారత్ తరఫున ధ్రువ్‌ జురెల్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, ఆకాశ్‌ దీప్‌, రజత్‌ పటీదార్‌, దేవదత్ పడిక్కల్ అరంగేట్రం చేశారు.

దాదాపు 112 ఏళ్ల తర్వాత ఐదు టెస్టుల సిరీస్‌లో 0-1తో వెనుకబడి.. 4-1తో సిరీస్‌ను గెలిచిన జట్టుగా భారత్ నిలిచింది.

యశస్వి జైస్వాల్ ఈ సిరీస్‌లో 712 పరుగులు చేసి ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచాడు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్‌పై ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

భారత్ తొలిసారి

టెస్టు చరిత్రలో భారత్‌ గెలుపోటముల నిష్పత్తి 1:1గా ఉండటం ఇదే తొలిసారి. 

మ్యాచ్‌లు: 579 గెలిచినవి: 178 ఓటములు: 178 డ్రా అయినవి: 222 టై: 1 

ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టు మ్యాచ్‌ భారత స్పిన్నర్‌ అశ్విన్‌కు కెరీర్‌లో 100వది. వందో టెస్టులో ఐదు వికెట్ల (5/77) ఘనత అందుకున్న నాలుగో బౌలర్‌గా అశ్విన్‌ నిలిచాడు.

వందో టెస్టులో అత్యుత్తమ బౌలింగ్‌ ప్రదర్శన అశ్విన్‌దే. ఇంగ్లాండ్‌పై రెండు ఇన్నింగ్స్‌ల్లో (9/128) సత్తాచాటాడు. ఈ సిరీస్‌లో అశ్విన్‌ 500 వికెట్ల క్లబ్‌లో చేరారు.

ఒక జట్టుపై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌ అశ్వినే. అతడు ఇప్పటివరకు ఆస్ట్రేలియాపై 114, ఇంగ్లాండ్‌పై 114 వికెట్లు పడగొట్టాడు. 

టెస్టు కెరీర్‌లో అత్యధిక సార్లు (36) ఐదు వికెట్ల ఘనత సాధించిన భారత బౌలర్‌గా అశ్విన్‌ రికార్డు సృష్టించాడు. అనిల్ కుంబ్లే (35)ని అధిగమించాడు. 

ఈ సిరీస్‌లో ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ నిలకడైన ఆటతీరు ప్రదర్శించాడు. ఈ క్రమంలోనే టెస్టుల్లో భారత్‌పై అత్యధిక (21) సార్లు 50 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 

ఒలింపిక్స్‌ గురించి ఆసక్తికర విషయాలు

శ్రీలంక పర్యటనలో భారత్‌.. ఎప్పుడు ఏ మ్యాచ్‌ అంటే?

టెస్టు క్రికెట్‌లో ఇంగ్లాండ్ ప్రపంచ రికార్డు

Eenadu.net Home