IND vs PAK: భారత్, పాక్ మ్యాచ్.. నమోదైన రికార్డులివే
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పలు రికార్డులు నమోదయ్యాయి. అవేంటంటే..
ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ (100*) శతకం చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. దీంతో వన్డే ప్రపంచకప్, టీ20 ప్రపంచ కప్, ఆసియా కప్, ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌పై ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న తొలి ఆటగాడిగా కోహ్లీ చరిత్ర సృష్టించాడు.
అంతేకాదు ఐసీసీ ఈవెంట్లలో పాకిస్థాన్‌పై అత్యధిక (5) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్న క్రికెటర్‌గా నిలిచాడు కింగ్. ఆసియా కప్ (వన్డే), ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌పై శతకం చేసిన తొలి బ్యాటర్‌గానూ విరాట్ రికార్డుల్లోకెక్కాడు.
ఐసీసీ టోర్నీల్లో ఒక దేశంపై అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకుంది కోహ్లీనే.
ఈ ఇన్నింగ్స్‌తో కోహ్లీ వన్డేల్లో 14,000 పరుగుల మైలురాయి అందుకున్నాడు. ఈ క్రమంలో వన్డేల్లో అత్యంత వేగంగా (287 ఇన్నింగ్స్‌లు) 14వేల పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. తర్వాతి స్థానాల్లో సచిన్ (350 ఇన్నింగ్స్‌లు), సంగక్కర (378 ఇన్నింగ్స్‌లు) ఉన్నారు.
ఈ మ్యాచ్‌లో కోహ్లీ రెండు క్యాచ్‌లు పట్టాడు. దీంతో వన్డేల్లో భారత్ తరఫున అత్యధిక క్యాచ్‌లు (158) పట్టిన క్రికెటర్‌గా నిలిచాడు. అజహరుద్దీన్ (156)ను కోహ్లీ అధిగమించాడు. ఓవరాల్‌గా జయవర్దెనె (218), రికీ పాంటింగ్ (160) ముందున్నారు.
తాజా శతకంతో అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక రన్స్ (27,503) చేసిన మూడో ఆటగాడిగా నిలిచాడు కోహ్లీ. రికీ పాంటింగ్ (27,483)ని కింగ్ అధిగమించాడు.
ఈ మ్యాచ్‌లో 20 పరుగులు చేసి వెనుదిరిగిన రోహిత్ శర్మ ఓ రికార్డు అందుకున్నాడు. సచిన్ (197 ఇన్నింగ్స్‌ల్లో)ను అధిగమించి వన్డేల్లో వేగంగా (181 ఇన్నింగ్స్‌ల్లో) 9వేల రన్స్ చేసిన ఓపెనర్‌గా రికార్డు సృష్టించాడు.