టీ20 ప్రపంచకప్‌: సఫారీలతో పోరుకు సై అంటున్న టీమ్‌ఇండియా

ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌, నెదర్లాండ్స్‌పై గెలిచి మంచి ఊపు మీదున్న టీమ్‌ఇండియా.. ఇప్పుడు సఫారీలతో పోరుకు సై అంటోంది. బంగ్లాదేశ్‌ని చిత్తుగా ఓడించి సౌతాఫ్రికా కూడా మంచి జోష్‌ మీదుంది.

Image:RKC

ఆదివారం భారత్, దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్‌ జరగనున్న నేపథ్యంలో ఇప్పటివరకు టీ20 ప్రపంచకప్‌లో ఇరుజట్ల మధ్య ఎన్ని మ్యాచ్‌లు జరిగాయి, ఏ జట్టు ఎక్కువ విజయాలు సాధించిందో ఓ సారి తెలుసుకుందాం.

Image:RKC

పొట్టి ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా, దక్షిణాఫ్రికా ఇప్పటివరకు ఐదుసార్లు తలపడ్డాయి. నాలుగుసార్లు భారత్‌ విజయం సాధించగా.. ఒకే ఒక్క మ్యాచ్‌లో సఫారీలు విజయం సాధించారు.

Image:RKC

ఈ ఇరు జట్లు తొలిసారిగా 2007 టీ20 ప్రపంచకప్‌ సూపర్‌ 8లో తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్.. నిర్ణీత ఓవర్లలో 153/5 స్కోరు చేయగా.. లక్ష్యఛేదనకు దిగిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 116 పరుగులే చేసింది. దీంతో భారత్‌ 37 పరుగుల తేడాతో గెలుపొందింది.

Image:RKC

2009 టీ20 ప్రపంచకప్‌ సూపర్‌ 8లో ఇండియా, సౌతాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన సఫారీలు 130/5 స్కోరు చేశారు. 131 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 118 పరుగులే చేయడంతో సౌతాఫ్రికా 12 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Image:RKC

2010 టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్‌ సిలో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 14 పరుగుల తేడాతో నెగ్గింది. తొలుత టీమ్‌ఇండియా.. 186/6 స్కోరు చేయగా.. లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా 172/5కి పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో సురేశ్ రైనా (101) శతకంతో ఆకట్టుకున్నాడు.

Image:RKC 

2012 పొట్టి ప్రపంచకప్‌ సూపర్‌ 8లో దక్షిణాఫ్రికాపై టీమ్‌ఇండియా ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత ఓవర్లలో 152/6 పరుగులు చేయగా.. సౌతాఫ్రికా 19.5 ఓవర్లలో 151 పరుగులకు ఆలౌటైంది.

Image:RKC

టీ20 ప్రపంచకప్‌లో భారత్‌, సౌతాఫ్రికా చివరిసారిగా 2014 సెమీ ఫైనల్‌లో తలపడ్డాయి. ఫస్ట్‌ బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా.. 20 ఓవర్లలో 172/4 స్కోరు చేసింది. విరాట్‌ కోహ్లీ (72) అర్ధ శతకంతో రాణించడంతో ఈ లక్ష్యాన్ని భారత్‌ ఐదు బంతులు మిగిలుండగానే ఛేదించింది.

Image:RKC

IPL: ఈసారి వీళ్లే టాక్‌ ఆఫ్‌ ది ఆక్షన్‌

IPL వేలం: 2022లో ₹ 551.7 కోట్లు... మరిప్పుడు ఎంత?

IPL వేలం: గతేడాది స్టార్క్‌.. అంతకుముందు ఎవరంటే?

Eenadu.net Home