సఫారీలతో టీ20 సమరం

టీ20 ప్రపంచకప్‌ ముంగిట ఈ ఫార్మాట్లో ఛాంపియన్‌ అయిన ఆస్ట్రేలియా మీద సిరీస్‌ గెలిచింది టీమ్‌ఇండియా. ఇప్పుడు సఫారీలతో పొట్టి సిరీస్‌ ఆడేందుకు సిద్ధమైంది.

Image:SocialMedia 

 బుధవారం నుంచి భారత్‌-సౌతాఫ్రికా మధ్య మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ ప్రారంభంకానుంది. తిరువనంతపురంలో తొలి టీ20 జరగనుంది.

Image:SocialMedia

టీమ్‌ఇండియా, దక్షిణాఫ్రికా మధ్య ఇప్పటివరకు 20 టీ20లు జరిగాయి. 11 మ్యాచ్‌ల్లో భారత్‌ విజయం సాధించగా.. దక్షిణాఫ్రికా ఎనిమిది మ్యాచ్‌ల్లో గెలుపొందింది. ఒక దాంట్లో ఫలితం తేలలేదు.

Image:SocialMedia

పొట్టి ఫార్మాట్‌లో ఇరుజట్ల మధ్య తొలి పోరు 2006 డిసెంబరు 1న జరిగింది. వీరేంద్ర సెహ్వాగ్‌ భారత జట్టుకు సారథ్యం వహించాడు. ఇందులో భారత్‌ 6 వికెట్ల తేడాతో నెగ్గింది.

Image:SocialMedia

భారత్ అత్యధిక స్కోరు 211/4. (2022లో) అత్యల్ప స్కోరు 92. (2015లో)

Image:SocialMedia

సౌతాఫ్రికా అత్యధిక స్కోరు 219/4. (2012లో)

అత్యల్ప స్కోరు 87. (2022లో) Image:SocialMedia

సఫారీలపై భారత్‌ తరఫున ఎక్కువ పరుగులు చేసిన వారి జాబితాలో రోహిత్‌ శర్మ 362 పరుగులు మొదటి స్థానంలో ఉండగా.. సురేశ్‌ రైనా (339), విరాట్ కోహ్లీ (254) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. Image:SocialMedia

సౌతాఫ్రికా తరఫున టీమ్ఇండియాపై ఎక్కువ పరుగులు చేసిన వారి జాబితాలో జేపీ డుమిని (295 పరుగులు) తొలి స్థానంలో ఉన్నాడు. క్లాసెన్‌ (210 పరుగులు), ఏబీ డివిలియర్స్‌ (208 పరుగులు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

Image:SocialMedia

దక్షిణాఫ్రికాపై టీమ్‌ఇండియా తరఫున భువనేశ్వర్‌ కుమార్‌ అత్యధికంగా 14 వికెట్లు పడగొట్టగా.. భారత్‌పై దక్షిణాఫ్రికా తరఫున జూనియర్ డాలా 7 వికెట్లు తీశాడు.

Image:SocialMedia

దక్షిణాఫ్రికా తరఫున జేపీ డుమిని అత్యధికంగా 16 సిక్సర్లు బాదగా.. భారత జట్టు తరఫున రోహిత్‌ శర్మ 14 సిక్స్‌లు కొట్టాడు.

Image:SocialMedia

IPL: ఈసారి వీళ్లే టాక్‌ ఆఫ్‌ ది ఆక్షన్‌

IPL వేలం: 2022లో ₹ 551.7 కోట్లు... మరిప్పుడు ఎంత?

IPL వేలం: గతేడాది స్టార్క్‌.. అంతకుముందు ఎవరంటే?

Eenadu.net Home