ఎప్పుడు ఏ మ్యాచ్‌ అంటే?

తొలుత భారత్, శ్రీలంక మధ్య మూడు టీ20ల సిరీస్‌ జరగనుంది. 

జులై 27, 28, 30 తేదీల్లో టీ20లు జరగనున్నాయి. ఈ మ్యాచ్‌లన్నీ పల్లెకెలె వేదికగా రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతాయి.

టీ20ల్లో భారత్‌కు సూర్యకుమార్‌ యాదవ్‌, శ్రీలంకకు చరిత్ అసలంక కెప్టెన్‌లుగా వ్యవహరించనున్నారు.

భారత్, శ్రీలంక మధ్య ఇప్పటివరకు 29 టీ20లు జరిగాయి. టీమ్‌ఇండియా 19, లంక 9 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.

భారత జట్టు: సూర్యకుమార్ (కెప్టెన్‌), గిల్ (వైస్‌ కెప్టెన్‌), యశస్వి, రింకు సింగ్, రియాన్ పరాగ్, పంత్ (వికెట్ కీపర్‌), సంజు శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, శివమ్ దూబె, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్‌, అర్ష్‌దీప్‌ సింగ్, ఖలీల్ అహ్మద్, మహ్మద్‌ సిరాజ్‌.

శ్రీలంక జట్టు: చరిత్ అసలంక (కెప్టెన్), పాథుమ్ నిశాంక, కుశాల్ జనిత్ పెరీరా, అవిష్క ఫెర్నాండో, కుశాల్ మెండిస్, దినేశ్ చండిమాల్, కమిందు మెండిస్, డాసున్ శనక, వానిందు హసరంగ, దునిత్ వెల్లలాగే, మహీశ్ తీక్షణ, చమిందు విక్రమసింఘే, మతీశా పతిరణ, నువాన్ తుషార, బినూర ఫెర్నాండో.

భారత్ - శ్రీలంక జట్ల మధ్య కొలంబో వేదికగా మూడు వన్డేల సిరీస్‌ కూడా జరగనుంది. 

ఆగస్ట్‌ 2, ఆగస్ట్ 4, ఆగస్ట్‌ 7న ఒన్డే మ్యాచ్‌లు జరుగుతాయి. అన్ని మ్యాచ్‌లు మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభం

ఈ మ్యాచ్‌లను సోనీ నెట్‌వర్క్ లైవ్‌ టెలికాస్ట్ చేస్తుంది. సోనీలివ్‌ యాప్‌, వెబ్‌సైట్‌లో లైవ్‌ స్ట్రీమింగ్ ఉంటుంది.

రోహిత్ శర్మ నాయకత్వంలో టీమ్‌ఇండియా బరిలోకి దిగనుంది. 

శ్రీలంకతో భారత్ ఇప్పటి వరకు 168 వన్డేల్లో తలపడింది. టీమ్‌ఇండియా 99, శ్రీలంక 57 మ్యాచుల్లో గెలిచాయి. 11 మ్యాచ్‌లు ఫలితం తేలకపోగా ఒకటి టై అయ్యింది.

భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), గిల్, విరాట్, శ్రేయస్, శివమ్‌ దూబె, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, రిషభ్‌ పంత్, కుల్‌దీప్‌, సిరాజ్, అర్ష్‌దీప్‌, ఖలీల్‌, హర్షిత్ రాణా

టీ20ల్లో వేగవంతమైన సెంచరీ.. భారత బ్యాటర్లు వీరే!

ఆ ‘పింక్‌’ మ్యాచ్‌లో ఏమైంది?

ఐపీఎల్ వేలం.. ఖరీదైన అన్‌క్యాప్‌డ్ ప్లేయర్స్‌

Eenadu.net Home