భారత్‌ వర్సెస్‌ జింబాబ్వే.. ఆసక్తికర విశేషాలు

టీమ్‌ఇండియా ప్రస్తుతం జింబాబ్వే పర్యటనలో ఉంది. ఆగస్టు 18 నుంచి ఇరుజట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌ ప్రారంభంకానుంది. ఇప్పటివరకు భారత్, జింబాబ్వే మధ్య జరిగిన వన్డేల్లో ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం.

image:Twitter

ఇరుజట్లు 63 వన్డేల్లో తలపడగా.. 51 మ్యాచ్‌ల్లో టీమ్‌ఇండియా విజయం సాధించింది. 10 వన్డేల్లో జింబాబ్వే గెలవగా.. రెండు టైగా ముగిశాయి.

image:Eenadu

జింబాబ్వేలో భారత్‌ ఇప్పటివరకు 23 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 19 నెగ్గి.. నాలుగింటిలో పరాజయం పాలైంది.

image:Eenadu

ఈ ఇరు జట్లు తొలిసారిగా 1983 ప్రపంచకప్‌లో తలపడ్డాయి. ఈ టోర్నీలో భారత్‌, జింబాబ్వే మధ్య రెండు మ్యాచ్‌లు జరగ్గా.. రెండింటిలోనూ టీమ్‌ఇండియాదే పైచేయి.

image:Eenadu

భారత్‌,జింబాబ్వే మధ్య చివరగా 2016 జూన్‌లో మూడు వన్డేల సిరీస్‌ జరిగింది. ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ భారత్‌ ఘన విజయం సాధించి సిరీస్‌ చేజిక్కించుకుంది. image:Eenadu 

వన్డేల్లో జింబాబ్వేపై భారత్‌ తరఫున అత్యధిక పరుగులు చేసిన రికార్డు సచిన్‌ తెందూల్కర్‌ (1377 పరుగులు) పేరిట ఉంది. ఇందులో 5 సెంచరీలు, 5 అర్ధ సెంచరీలున్నాయి.

image:Eenadu

 వన్డేల్లో జింబాబ్వేపై టీమ్‌ఇండియా తరఫున అత్యధిక వికెట్లు (45) తీసిన రికార్డు అజిత్‌ అగార్కర్‌ పేరిట ఉంది. (4/18 అత్యుత్తమ ప్రదర్శన)

image:Eenadu

జింబాబ్వేపై టీమ్‌ఇండియా అత్యధిక స్కోరు 333/6 కాగా.. అత్యల్ప స్కోరు 168.

image:Eenadu

భారత్‌పై జింబాబ్వే అత్యధిక స్కోరు 289/4 కాగా.. అత్యల్ప స్కోరు 65.

image:Eenadu

2005 ఆగస్టు 29న జరిగిన వన్డేలో జింబాబ్వేపై టీమ్‌ఇండియా 161 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ జట్టుపై ఇదే భారీ గెలుపు.

image:Eenadu

వన్డేల్లో జింబాబ్వేపై అత్యధిక సిక్స్‌లు బాదిన భారత క్రికెటర్‌ సౌరభ్‌ గంగూలీ. అతడు 27 సిక్స్‌లతో తొలి స్థానంలో ఉండగా.. సచిన్‌ (20 సిక్స్‌లు) రెండో స్థానంలో ఉన్నాడు.

image:Eenadu

వన్డేల్లో టీమ్ఇండియాపై జింబాబ్వే ఆటగాడు ఆండీ ఫ్లవర్ అత్యధికంగా 1298 పరుగులు చేయగా.. హీత్‌ స్ట్రీక్‌ 39 వికెట్లు తీశాడు.

image:Twitter

IPL: ఈసారి వీళ్లే టాక్‌ ఆఫ్‌ ది ఆక్షన్‌

IPL వేలం: 2022లో ₹ 551.7 కోట్లు... మరిప్పుడు ఎంత?

IPL వేలం: గతేడాది స్టార్క్‌.. అంతకుముందు ఎవరంటే?

Eenadu.net Home