హాలీవుడ్‌లో మన తారలు
తాజాగా విడుదలైన ‘హార్ట్ ఆఫ్ స్టోన్’తో ఆలియా భట్.. హాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఈమె కంటేముందు పలువురు భారతీయ నటీమణులు కూడా హాలీవుడ్‌లో మెరిశారు. వారెవరంటే..
Image: Instagram
తన ప్రతిభతో బాలీవుడ్ నుంచి గ్లోబల్ స్టార్‌గా ఎదిగింది.. ప్రియాంక చోప్రా.. ‘ది వైట్ టైగర్’, ‘బేవాచ్’, ‘మ్యాట్రిక్స్..’ చిత్రాలతో ఆకట్టుకుంది. ఇటీవల ‘సిటాడెల్’ వెబ్‌సిరీస్‌లో స్పైగా మెప్పించింది.
మరో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె కూడా హాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. విన్ డీజిల్ నటించిన ‘ట్రిపుల్ ఎక్స్: రిటర్న్ ఆఫ్ గ్జాండర్ కేజ్’లో నటించింది.
మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ కొన్నేళ్ల కిందటే ‘బ్రైడ్ అండ్ ప్రీజుడిస్’, ప్రోవోక్డ్’, ‘ది పింక్ పాంథర్ 2’ తదితర హాలీవుడ్ చిత్రాల్లో నటించింది.
టాలీవుడ్, బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలిగిన టబు.. ప్రస్తుతం సహాయ పాత్రలు చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తోంది. గతంలో టబు ‘ది నేమ్‌సేక్’, ‘లైఫ్ ఆఫ్ పై’ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించింది.
ముంబయిలో పుట్టి పెరిగిన ఫ్రిదాపింటో.. ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’తో తెరంగేట్రం చేసి.. హాలీవుడ్‌లో స్థిరపడింది. ‘మిరాల్’, ‘డే ఆఫ్టర్ ది ఫాల్కన్’, ‘లవ్ వెడ్డింగ్ రిపీట్’ తదితర చిత్రాల్లో నటించింది.
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శ్రియ కూడా హాలీవుడ్ చిత్రంలో నటించింది. 2007లో విడుదలైన ‘ది అదర్ ఎండ్ ఆఫ్ ది లైన్’చిత్రంలో నటించింది.
బాలీవుడ్ భామ హ్యూమా ఖురేషీ ఓ హాలీవుడ్ చిత్రంలో మెరిసింది. 2021లో వచ్చిన జాంబీ చిత్రం ‘ఆర్మీ ఆఫ్ ది డెడ్’లో కీలక పాత్ర పోషించింది.
టాలీవుడ్ స్టార్ సమంత.. ‘ఆరెంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్’ నవల ఆధారంగా తెరకెక్కుతోన్న హాలీవుడ్ చిత్రంలో నటిస్తోంది. దీనికి ‘చెన్నై స్టోరీస్’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
ఈ మధ్య పలు వివాదాల్లో చిక్కుకున్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఓ ఆంథాలజీ చిత్రంతో హాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తోంది. ‘టెల్ ఇట్ లైక్ ఏ విమెన్’ పేరుతో దీన్ని తెరకెక్కిస్తున్నారు.